రంగమార్తాండ మూవీ పై సింగర్ సునీత స్పందన

Singer Sunitha's Reaction after watching Rangamarthanda Movie

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో మరాఠీ సూపర్ హిట్ నట సామ్రాట్ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన రంగ మార్తాండ మూవీ ఉగాది కానుకగా మార్చి 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అనసూయ, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా ముఖ్య పాత్రలలో నటించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీకి మెగా స్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం. క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా రంగ మార్తాండ మూవీని వీక్షించిన ప్రముఖ సింగర్ సునీత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ.. వారి నుండి అద్భుత పెర్ఫార్మెన్స్ రాబట్టడం ఒక్క కృష్ణవంశీ కే సాధ్యం అయిందనీ.. హృదయాలను కదిలించే పలు సన్నివేశాలు ఉన్నాయనీ.. తప్పకుండా చూడాల్సిన సినిమా రంగమార్తాండ అనీ ఒక వీడియో ను సింగర్ సునీత ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.