టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘మురారి’ చిత్రం మళ్ళీ విడుదలైంది. 4k టెక్నాలజీతో సరికొత్త హంగులతో ముస్తాబై నేడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా గ్రాండ్ రీ రిలీజ్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను చూసేందుకు ఈ ఉదయం నుంచే పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకొని క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. మరికొందరు డప్పులు మోగిస్తూ, బాణాసంచా కాలుస్తూ హల్ చల్ చేస్తున్నారు.
కాగా 2001 ఫిబ్రవరి 17న విడుదలైన మురారి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు. 2001లో విడుదలైన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించి ఆయన సినీ కెరీర్‌లోనే మరపురాని చిత్రంగా నిలిచియింది. సరిగ్గా చెప్పాలంటే.. మహేష్ లోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా.
మూవీలో మహేష్ స్క్రీన్ ప్రజెన్స్, ఆయన అమాయకమైన హావభావాలు, అల్లరి చేష్టలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌కి ముందు రవిబాబుతో ఫైట్ తరువాత వచ్చే సన్నివేశాలలో మహేష్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినీ విమర్శకులు సైతం ఆయన నటనను ప్రశంసించారు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ మహేష్ బాబుకు బాగా కనెక్ట్ అయ్యారు.
మురారి సినిమా కథ విషయానికొస్తే.. 19వ శతాబ్దంలో ఒక వూరి జమీందారు గ్రామ దేవతకు సంబంధించిన ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించి, అమ్మవారి ఆగ్రహానికి గురై రక్తం కక్కుకుని చనిపోతాడు. అయితే ఆ జమీందారు చేసిన పాపం అతని వంశానికి శాపంగా పరిణమిస్తుంది. దీని వలన ప్రతీ 48 ఏళ్ళకొకసారి అతని వంశస్తుల్లో ఒకరు ఆ దేవత శాప ప్రభావం వలన అకాల మృతి చెందుతుంటారు.
ఈ నేపథ్యంలో ఒకసారి కథానాయకుడైన మురారి (మహేష్ బాబు) జాతకం చూసిన ఆ గుడి పూజారి ఈసారి మరణించబోయేది మురారే అని తెలుసుకుంటాడు. దీంతో మురారి బామ్మతో కలిసి దోష పరిహారం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీరి ప్రయత్నాలు ఫలిస్తాయా? మురారి మృత్యువాత నుండి ఎలా తప్పించుకోగలిగాడు? మురారి బామ్మ అమ్మవారి శాపాన్ని నివారించి తన వంశాన్ని కాపాడుకోగలిగిందా? అనేది తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ భామ సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా.. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, అన్నపూర్ణ, ప్రసాద్ బాబు, లక్ష్మి, శివాజీ రాజా, చిన్నా, హేమ, అనిత చౌదరి, రవి బాబు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈసినిమాను ఎన్.రామలింగేశ్వర రావు సారథ్యంలో రాంప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం దేవీప్రసాద్ నిర్మించారు.
2001 ఏడాదికి గానూ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా రజత నందితో సహా మరో 2 అవార్డులను సొంతం చేసుకుంది.
తెలుగునాట నెం.1 డిజిటల్ మీడియాగా వెలుగొందుతోన్న ‘మ్యాంగో మాస్ మీడియా’ మురారి రీ-రిలీజ్‍ను సరికొత్త హంగులతో 4Kలో ప్రేక్షకులకు అందిస్తోంది. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సేవలను నిర్వహిస్టోన్న ‘మహేష్ బాబు ఫౌండేషన్’ కు అందించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: