రంగమార్తాండ ట్రైలర్ రిలీజ్

rangamarthanda movie trailer out now

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థల నటుడి కష్టాల గురించి తెలియచేస్తూ తీసిన సినిమా ఇది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, అలానే పాటలు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు రోజుల క్రితమే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఫుల్ ఎమోషనల్ రైడ్ గా సాగి సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఫుల్ ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంటుంది. రంగస్థల నటుడిగా కీర్తి సత్కారాలు అందుకున్న రాఘవరావు.. కన్న పిల్లల ఛీత్కారాలు, సమాజం నుండి అవమానాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? రంగమార్తాండ రాఘవరావు కథ ఎలా ముగిసిందనేదే ట్రైలర్ లో చూపించారు. బ్రహ్మానందం డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి.

కాగా ఈసినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌ తో పాటు ర‌మ్య‌కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 3 =