అలనాటి రామచంద్రుడు ట్రైలర్ రిలీజ్

alanaati ramachandrudu movie trailer out now

చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ వంశీ, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ అలనాటి రామచంద్రుడు. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించారు. ఆగష్ట్ 2 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ వరుసగా అప్ డేట్లను ఇస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ ను చూస్తుంటే.. ఇది ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించే నిజాయితీ గల యువకుడి కథగా అనిపిస్తుంది. తను ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. చుట్టుపక్కల ఉన్నవారందరూ తన ప్రేమ గురించి అమ్మాయికి చెప్పమని బలవంతం చేస్తారు. కానీ ఆమె నో చెబితే ఏమౌతుందో అని భయపడతాడు. అయితే వీరి మధ్య కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కథలోని డ్రామా, ఎమోషనల్ రిచ్‌నెస్‌ని ట్రైలర్ అద్భుతంగా క్యాప్చర్ చేసింది. అర్థవంతంగా రాసిన డైలాగ్‌లు, హత్తుకునే సన్నివేశాలతో మంచి రొమాంటిక్ డ్రామాతో కంప్లీట్ లవ్ స్టొరీని చూడబోతున్నామనే భరోసా ఇచ్చింది ట్రైలర్.

కాగా ఈసినిమాలో ఇంకా బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిన, చైతన్య గరికిపాటి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్: ప్రేమ్ సాగర్, శశాంక్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను ఏపీ, తెలంగాణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.