ప్రతి శుక్రవారం, ప్రతి పండక్కి ఇలా పలు స్పెషల్ అకేషన్స్ కు బాక్సాఫీస్ వద్ద సినిమాలు సందడి చేస్తూనే ఉన్నాయి. ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి.. ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేయడమే కాకుండా మంచి మెసేజ్ ను కూడా ఇస్తుంటాయి. ఈ కోవలోకే వస్తుంది తాజాగా వచ్చిన రంగమార్తాండ సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కృష్ణవంశీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లోతైన భావోద్వేగాలను సైతం చూపించడంలో ఆయన దిట్ట అని మరోసారి ఈసినిమాతో చూపించాడు కృష్ణవంశీ. తల్లితండ్రులు బాగున్నప్పుడే వారిని చూసుకోవాలని మెసేజ్ ను ఇచ్చాడు. ఇక ఈసినిమా రిలీజ్ కు ముందే పాజిటివ్ బజ్ ను సొంతం చేసుకోగా.. రిలీజ్ తరువాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా చూసిన వారందరూ బరువెక్కిన గుండెలతో థియేటర్ల నుండి బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని అంటున్నారు. ఈ రెస్పాన్స్ చాలు ఈసినిమా ఎంత ఆదరణ పొందుతుందో చెప్పడానికి. ఇక ముందు ముందు కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడం ఖాయం అంటున్నారు.
కాగా ఈసినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: