సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఎవర్ గ్రీన్ గా గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో మురారి సినిమా కూడా ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2001లో విడుదలైన ఈసినిమా మహేష్ సినీ కెరీర్ నే ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. కథ, కథాంశం, మహేష్ నటన, పాటలు అన్నీ సినిమా విజయంలో భాగమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు ఉత్తమ అవార్డులు సైతం దక్కాయి. పలు విభాగాల్లో పలు నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీలో మహేష్ నటనకు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు లభించింది. లక్ష్మి కూడా ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే ఆ ఏడాది రెండో ఉత్తమ చిత్రంగా నంది అవార్డుకు ఈ సినిమా ఎంపికైంది.
ఇక ఈసినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ పుట్టినరోజు సందర్భంగా అగష్ట్ 9వ తేదీన మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఈసినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను 4కే వెర్షన్ కూడా రెడీ అయిపోయింది. డైరెక్టర్ కృష్ణవంశీ స్వయంగా 4కే వెర్షన్ కలర్ కరెక్షన్ లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిపారు. అంతేకాదు వర్జినల్ వెర్షన్ నుండి 18 నిమిషాలు కూడా ట్రిమ్ చేసినట్టు తెలియచేశారు.
కాగా ఈసినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ భామ సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా.. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, అన్నపూర్ణ, ప్రసాద్ బాబు, లక్ష్మి, శివాజీ రాజా, చిన్నా, హేమ, అనిత చౌదరి, రవి బాబు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈసినిమాను ఎన్.రామలింగేశ్వర రావు సారథ్యంలో రాంప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం దేవీప్రసాద్ నిర్మించారు.
ఇక ఈఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆసినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాగా.. ఈసినిమాలో మహేష్ మేకోవర్, స్టైల్, డైలాగ్స్, ఎనర్జిటిక్ యాక్షన్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు ఎప్పటినుండో మహేష్ ను ఈ యాంగిల్ లో చూడాలనుకుంటున్న మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. ఈసినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. ఈసినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























