క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖడ్గం. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్న తరుణం లో చిత్ర యనిట్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ.. “మాకు ఈ సినిమా తీయడంలో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం. ఈ సినిమాకి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్” అని చెప్పారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “జనరేషన్స్ మారినా పేట్రియాటిక్ ఫిల్మ్స్ అన్నిటిలో ఖడ్గం ఒక గొప్ప చిత్రం. అసలు ఖడ్గం సినిమాలో నిర్మాత మధు మురళి నన్ను వద్దు ఆన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్‍లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.” అన్నారు.
నటుడు షఫీ మాట్లాడుతూ.. “నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చి నా వనవాసంకి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు” అని చెప్పారు.
శివాజీ రాజా మాట్లాడుతూ.. “నిర్మాత మధు మురళి గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి ఈ సినిమా చేసినందుకు థాంక్స్. ఇటీవలే మురారి పండుగు చేసుకున్నాం. ఇప్పుడు ఖడ్గం రీ రిలీజ్ అవుతుంది. నాకు చాలా సంతోషం గా ఉంది. నేను ఖడ్గంలో చేయను అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో అన్నిటిలో మంచి పేరు వచ్చింది.” అన్నారు.
దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఖడ్గం చిత్రం 2002 నవంబర్ 29న విడుదలై ఘనవిజయం సాధించింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ, షఫీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మించాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ రచన చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























