మురారి రీ రిలీజ్‍ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్

mahesh babu murari movie re release trailer update

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్‍ చేస్తున్నారు. ఇక రీ-రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు ‘మురారి’ త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న మురారి రీ రిలీజ్‌ అవుతుండగా.. అంతకుముందు రోజు ఒక్కడు సినిమా ప్రత్యేకంగా ఎంపిక చేసిన థియేటర్లలోకి వస్తోంది. దీంతో తమ అభిమాన హీరో చిత్రాలు రెండు ఒక్కరోజు వ్యవధిలో థియేటర్లలోకి వస్తుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మురారి రీ-రిలీజ్‍ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్ ను ఇచ్చారు. రేపు అంటే ఆగష్ట్ 2వ తేదీన సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు

తెలుగునాట నెం.1 డిజిటల్ మీడియాగా వెలుగొందుతోన్న ‘మ్యాంగో మాస్ మీడియా’ మురారి రీ-రిలీజ్‍ను సరికొత్త హంగులతో 4కెలో ప్రేక్షకులకు అందిస్తోంది. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సేవలను అందిస్టోన్న ‘మహేష్ బాబు ఫౌండేషన్’ కు అందించనుంది.

కాగా 2001లో విడుదలైన ఈసినిమా మహేష్ సినీ కెరీర్ నే ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. కథ, కథాంశం, మహేష్ నటన, పాటలు అన్నీ సినిమా విజయంలో భాగమయ్యాయి. ఈసినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ భామ సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా.. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, అన్నపూర్ణ, ప్రసాద్ బాబు, లక్ష్మి, శివాజీ రాజా, చిన్నా, హేమ, అనిత చౌదరి, రవి బాబు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈసినిమాను ఎన్‌.రామ‌లింగేశ్వ‌ర రావు సార‌థ్యంలో రాంప్ర‌సాద్ ఆర్ట్స్ ప‌తాకంపై నందిగం దేవీప్ర‌సాద్ నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.