రంగమార్తాండ – ఫస్ట్ డౌట్ ఉంది.. ఇప్పుడు నమ్మకం ఉంది

ramya krishnan sharing interesting facts about rangamarthanda movie

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ రంగమార్తాండ. ఈసినిమా రిలీజ్ ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పొచ్చు. ఈసినిమా కోసం కృష్ణవంశీ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా చాలా రోజుల నుండి జోరుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.. అంతేకాకుండా ఈసినిమా ప్రీమియర్ షోను చూసిన సినీ సెలబ్రిటీలు ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు కూడా ఇచ్చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. ఈసినిమాలో నేను నటించిన పాత్ర కోసం చాలామందిని ముందు అడగడం జరిగింది కృష్ణవంశీ.. అయితే వర్కౌట్ కాకపోవడంతో నేను చేస్తానులే అని అనాల్సి వచ్చింది అంటూ చమత్కరించారు. ఇక కథ గురించి చెబుతూ.. నిజానికి ఇలాంటి ఎమోషనల్ కథలను ఈరోజుల్లో చూస్తారా అన్న డౌట్ వచ్చింది.. కానీ షూటింగ్ అవుతున్నా కొద్దీ సినిమాపై నమ్మకం ఏర్పడింది.. ఈ సినిమాలోని సన్నివేశాలను కృష్ణవంశీ అద్భుతంగా చిత్రీకరించాడు. డైలాగ్స్ కూడా మనసును తాకేలా ఉంటాయి. క్లైమాక్స్ సీన్ ను చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు తలచుకున్నా ఏడుపు వచ్చేస్తోంది.. కృష్ణవంశీ కెరియర్లోని చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటిగా నిలుస్తుంది అని తెలిపారు.

కాగా ఈసినిమాలో ర‌మ్య‌కృష్ణ‌ తో పాటు ప్ర‌కాశ్ రాజ్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =