క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా రంగమార్తాండ. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఎప్పటినుండో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఎప్పటికప్పుడు ప్రతి అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. అంతేకాదు వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా సోల్ ఆఫ్ రంగమార్తాండ అంటూ వచ్చిన సాంగ్ అలానే బ్రహ్మానందం గ్లింప్స్, ఇంకా పలు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒకపక్క రిలీజ్ కు సిద్దమవుతున్నా కూడా ఇంతవరకూ రిలీజ్ పై ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే తాజాగా దానిపై కూడా అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం అంటూ పోస్ట్ లో పేర్కొంటూ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రబృందం.
ఈ మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం …#Rangamarthanda on March 22nd…@PRAKASHRAAJ @MERAMYAKRISHNAN #BRAHMANANDAM @ilaiyaraaja @RajaShyamalaEnt @MythriOfficial @kalipumadhu5 @venky8883 @SillyMonksMusic #RangamarthandaOnMarch22 pic.twitter.com/e0Aypuay6T
— Krishna Vamsi (@director_kv) March 15, 2023
కాగా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: