టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న ‘మురారి’ రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే దీనికి ఒక్కరోజు ముందు ‘ఒక్కడు’ సినిమా కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో విడుదలకానుంది. ఇక రీ రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ సూపర్ స్టార్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. తమ అభిమాన హీరో చిత్రాలు రెండు ఒక్కరోజు వ్యవధిలో థియేటర్లలోకి వస్తుండటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మురారి చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి, తాజాగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మురారి అద్భుతమైన చిత్రమని పేర్కొన్న ఆమె ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ కృష్ణవంశీ గారికే చెందుతుందని చెప్పారు. ఇక ఈ మూవీ కోసం చాలామంది యంగ్‍స్టర్స్ పనిచేసినట్టు తెలిపిన నందిని రెడ్డి షూటింగ్ మొత్తం ఒక వెకేషన్ లా ఉండేదని అన్నారు.
ఈ సందర్భంగా నందిని రెడ్డి ఏమన్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.. “కృష్ణ వంశీ గారు చాలా హడావిడి షెడ్యూల్‌తో ప్రారంభించారు. మొదటి వారంలో మేమంతా రాత్రింబగళ్లు పని చేయడంతో చాలా అలసిపోయాం. ఈ మూవీలో చాలామంది ఆర్టిస్టులలు ఉన్నారు. వీరి కోసం రకరకాల కలర్స్ కలిగిన కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాల్సి వచ్చేది. తొలుత మేము కొన్ని కాంబినేషన్స్ రెడీ చేసి పెట్టుకునేవాళ్ళం. అయితే కృష్ణవంశీ గారు వచ్చి కొన్ని మెయిన్ లీడ్స్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలో చెప్పి వెళ్లేవారు.”
“దీంతో అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చేది. ఆయన సూచనల మేరకు ఆ షాట్‌కు సరిపోయేలా మేము నటీనటుల కాస్ట్యూమ్‌లను త్వరగా మార్చాల్సి వచ్చేది. ఉదాహరణకు, సోనాలి బింద్రేకి సంబంధించి ఏవైనా మార్పులు ఉంటే.. అందుకు అనుగుణంగా కాంట్రాస్ట్ కలర్స్ కోసం మేము ఇతర నటుల దుస్తులను మార్చాల్సి వచ్చేది. ఇది నిజంగా కష్టమైన పని. దీనికోసం స్టార్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పనిచేసాం. ఆయనతో వర్క్ చేయడం అదే ఫస్ట్ టైమ్. కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేషన్ సూపర్బ్.”
“ఒకసారి మురారి చిత్రీకరణ రామచంద్రాపురం అనే ఊరి దగ్గరలో జరుగుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్లు హాస్పిటాలిటీ విషయంలో సిబ్బందితో గొడవ పడ్డారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్లు సినిమా షూటింగ్‌ని ఒక రోజంతా బాయ్ కాట్ చేసారు. అయితే ఆ రోజు కృష్ణవంశీ గారు ప్రతి సీన్‌ని అసిస్టెంట్స్ ఎవరూ లేకుండా ఒక్కరే తీశారు. ఆ తర్వాత సాయంత్రం మాకందరికీ ఆయన ఫుల్ క్లాస్ పీకారు. అయితే అప్పుడు మేము చిన్నవయసులో ఉండటం వలన అలా చేసాం. ఆ వయసులో అల్లరి చేయడం సహజమే కదా.. (నవ్వుతూ).”
“మహేష్ బాబు, సోనాలి బింద్రే అప్పటికే పెద్ద స్టార్స్. అయినాసరే సెట్స్‌లో అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. మా మధ్య చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఉండేది. సోనాలి రోజూ చాలా పెద్ద బాక్స్‌లో జ్యూస్ తెచుకునేది. ఇది చూసిన కృష్ణవంశీ, మహేష్ బాబు చూడటానికి సన్నగా ఉంటావ్, ఎటు పోతుంది ఆ డ్రింక్ అంతా.. అని తనని సరదాగా ఆట పట్టించేవారు. మేమందరం నవ్వుకునేవారం.”
“మహేష్ గారు అయితే చాలా సింపుల్‌గా ఉండేవారు. పెద్ద స్టార్ అన్న భావన లేకుండా అందరితో నవ్వుతూ మాట్లాడేవారు. అప్పుడు నాతో ఎలా ఉండేవారో.. ఇప్పుడు కనిపించినా అదే ఆప్యాయతతో పలకరిస్తారు. ఇది నాకు చాలా విస్మయాన్ని కలిగిస్తుంది. అయితే మురారి చిత్రాన్ని నేను ఇంతవరకూ బిగ్ స్క్రీన్‌పై చూడలేదు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నన్ను వేరే పనిపై నార్త్ ఇండియా పంపించారు కృష్ణవంశీ గారు. దీంతో చాలా బాధపడ్డాను. అయితే ఇప్పుడు మురారిని బిగ్ స్క్రీన్‌పై ఫస్ట్ టైమ్ చూడబోతున్నా.. అది కూడా మీ అందరితో కలిసి ఆగస్టు 9వ తేదీన చూస్తాను.” అని పేర్కొన్నారు నందినీ రెడ్డి.
కాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమా 2001 ఫిబ్రవరి 17న విడుదలైంది. మహేష్ బాబు టైటిల్ రోల్‌లో నటించగా.. ఆయన సరసన సోనాలి కథానాయికగా కనిపించింది. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, గొల్లపూడి, లక్ష్మి, ప్రసాద్ బాబు, రఘుబాబు సహా ఎంతోమంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై ఎన్ దేవి ప్రసాద్, రామలింగేశ్వరరావు, గోపి నందిగం నిర్మించిన ఈ చిత్రానికి ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.
తెలుగునాట నెం.1 డిజిటల్ మీడియాగా వెలుగొందుతోన్న ‘మ్యాంగో మాస్ మీడియా’ మురారి రీ-రిలీజ్‍ను సరికొత్త హంగులతో 4Kలో ప్రేక్షకులకు అందిస్తోంది. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సేవలను నిర్వహిస్టోన్న ‘మహేష్ బాబు ఫౌండేషన్’ కు అందించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: