ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. సెలబ్రిటీల పుట్టిన రోజుల సందర్భాలు, ప్రత్యేక అకేషన్స్ అప్పుడు సినిమాలను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 2001లో విడుదలైన ఈసినిమా మహేష్ సినీ కెరీర్ నే ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. కథ, కథాంశం, మహేష్ నటన, పాటలు అన్నీ సినిమా విజయంలో భాగమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను మహేష్ పుట్టినరోజు సందర్భంగా అగష్ట్ 9వ తేదీన మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రీ రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా ఈసినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ భామ సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా.. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, అన్నపూర్ణ, ప్రసాద్ బాబు, లక్ష్మి, శివాజీ రాజా, చిన్నా, హేమ, అనిత చౌదరి, రవి బాబు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈసినిమాను ఎన్.రామలింగేశ్వర రావు సారథ్యంలో రాంప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం దేవీప్రసాద్ నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: