రీ రిలీజ్ ల ట్రెండ్ నేపథ్యంలో సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన కల్ట్ మూవీ ఖడ్గం మళ్ళీ రిలీజ్ కానుంది.గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న ఈసినిమా రీ రిలీజ్ కానుంది.దేశ భక్తి నేపథ్యంలో కమర్షియల్ ఫార్ములా తో తెరకెక్కిన ఈసినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.శ్రీకాంత్,రవితేజ,ప్రకాష్ రాజ్ లీడ్ రోల్స్ లో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.మధు మురళి ఈసినిమాను నిర్మించాడు.2002 లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాకుండా పలు అవార్డులు కూడా గెలుచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక 22 ఏళ్ళ తరువాత ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుంది.రీసెంట్ గానే సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి కూడా రీ రీలీజ్ అయ్యింది.దీన్ని కూడా కృష్ణవంశీనే డైరెక్ట్ చేశాడు.ఈసినిమా ఊహించని రెస్పాన్స్ తెచ్చుకుంది.రీ రిలీజ్ మూవీస్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది.మరి ఖడ్గం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
అయితే ఖడ్గం రిలీజ్ ముందు సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతుంది.ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.కొరటాల శివ తెరకెక్కిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ఇక సరిగ్గా ఈసినిమా రిలీజ్ అయిన 5రోజులకే ఖడ్గం రీ రిలీజ్ అవుతుంది.దాంతో ఖడ్గంకు దేవర ఎఫెక్ట్ తప్పకపోవచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: