
ట్యాగ్ · 80 కథనాలు · పేజీ 4


'రొమాంటిక్' ట్రైలర్ రిలీజ్

వరుస ఆఫర్స్ తో కేతిక శర్మ బిజీ

మారిన 'రొమాంటిక్' రిలీజ్ డేట్

'లక్ష్య' జగపతిబాబు లుక్ రిలీజ్

"లక్ష్య "మూవీ గ్లింప్స్ రిలీజ్

మూడో సినిమాను పట్టాలెక్కించిన 'వైష్ణవ్ తేజ్'

"లక్ష్య "మూవీ వర్కింగ్ స్టిల్

'లక్ష్య' న్యూ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా

వైష్ణవ్ తేజ్ కు జోడీగా కేతిక శర్మ ?
"లక్ష్య "మూవీ అప్ డేట్

"#NTR30" మూవీ లో కేతిక శర్మ ?
ఒక్క సినిమాకే సుకుమార్ సినిమాలో ఛాన్స్..!

'రొమాంటిక్' నుండి మరో ట్రైలర్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. అనిల్ పాడూరి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న విడుదలవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో కూడా స్పీడు పెంచారు. ఒకపక్క పూరీ లైగర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా కూడా తనయుడి కోసం ప్రమోషన్స్ కోసం తన సపోర్ట్ ను అందిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసారి రిలీజ్ చేసిన ట్రైలర్ లో క్రైమ్ యాంగిల్స్ ను చూపించారు.

'రొమాంటిక్' ట్రైలర్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించడమే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోలను చేశాడు. ఇక ఇప్పుడు తనయుడు ఆకాష్ పూరి సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు పూరీ. పూరీ తనయుడు ఆకాష్ పూరీ ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఇక ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. అనిల్ పాడూరి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. నిజానికి ఈసినిమాను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 న…

వరుస ఆఫర్స్ తో కేతిక శర్మ బిజీ
అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, యూట్యూబర్ , సింగర్, మోడల్, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన "రొమాంటిక్" మూవీ ని దీపావళి సందర్భంగా నవంబర్4వ తేదీ విడుదల చేయడానికి మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని అక్టోబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు . ఈ మూవీ తో కేతిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మారిన 'రొమాంటిక్' రిలీజ్ డేట్
కరోనా సెకండ్ వేవ్ తరువాత పెండింగ్ లో ఉన్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలకు మాత్రం ఇంకా రిలీజ్ మోక్షం కలగలేదు. అందులో పూరీ తనయుడు ఆకాష్ పూరి సినిమా రొమాంటిక్ కూడా ఒకటి ఉంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిఉంది కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఇటీవలే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఇప్పుడు మళ్లీ ఏమైందో తెలియదు కానీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 29న ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి అధికారికంగా ప్రకటించారు.

దీపావళి రేస్ లో 'రొమాంటిక్' మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రొమాంటిక్'. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ముందు కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడినా ఆ తరువాత కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంకా ఆలస్యం అయింది. ఇప్పటికే ఎన్నో రిలీజ్ లు వాయిదా పడగా.. ఇక తాజాగా మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

'లక్ష్య' జగపతిబాబు లుక్ రిలీజ్
సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమా లక్ష్య. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో జగపతిబాబు 'పార్ధసారధి' అనే పాత్రను పోషిస్తున్నట్టు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

"లక్ష్య " మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో “లక్ష్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక.ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో అలరించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

"లక్ష్య "మూవీ గ్లింప్స్ రిలీజ్
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ప్రాచీన విలువిద్య నేపథ్యంలో “లక్ష్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. “లక్ష్య “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మూడో సినిమాను పట్టాలెక్కించిన 'వైష్ణవ్ తేజ్'
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ ఆసినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా చేశాడు. ఈసినిమా షూటింగ్ అయితే పూర్త అయింది కూడా. ఇన్ని రోజులు థియేటర్లు లేవు కాబట్టి సినిమాను రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవ్వడంతో త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

"లక్ష్య "మూవీ వర్కింగ్ స్టిల్
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో "లక్ష్య "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. "రొమాంటిక్ "మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. "లక్ష్య "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

'లక్ష్య' న్యూ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో లక్ష్య సినిమా కూడా ఒకటి. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల చాలా సార్లు బ్రేక్ పడింది. దాదాపు చివరి దశకు వచ్చిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. “లక్ష్య” త్వరలోనే విడుదల కానుండడంతో పోస్టర్ ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ప్రతి శుక్రవారం అప్ డేట్ ఇస్తామని ఇటీవలే చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా.

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా
ఇతర భాషా కథానాయికలు టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హిందీ తర్వాత జాతీయస్థాయిలో పెద్ద మార్కెట్ కలిగిన టాలీవుడ్‌పై కొత్త కథానాయికలు ఆసక్తి చూపుతారు. కొత్త కథానాయికలు నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకొనడం విశేషం. అడివిశేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన "మేజర్ " మూవీ తో "దబంగ్ 3" బాలీవుడ్ మూవీ బ్యూటీ సయీ మంజ్రేకర్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న "గని "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా
బ్లాక్ బస్టర్ “ఉప్పెన” మూవీ తో కృతిశెట్టి టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడిన ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో కృతిశెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.కృతిశెట్టి ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్”, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీలో కృతి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు.

'అర్జున్ రెడ్డి' రీమేక్ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఒక్క సినిమాతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోస్ కే పోటీ ఇస్తున్నాడు. ఆహీరో ఇంకెవరూ సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతూ బిజీ అయిపోతున్నాడు. అంతేనా పెద్ద పెద్ద బ్యానర్స్ లోనే చాన్స్ లు కొట్టేస్తున్నాడు.

వైష్ణవ్ తేజ్ కు జోడీగా కేతిక శర్మ ?
హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ బ్లాక్ బస్టర్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే."ఉప్పెన "మూవీ ఘనవిజయం సాధించడం తో వైష్ణవ తేజ్ పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన మూవీ లో వైష్ణవ తేజ్ కథానాయకుడిగా నటించారు. సీనియర్ హీరోయిన్ రకుల్ సింగ్ కథానాయికగా నటించారు.
'లక్ష్య' టీజర్ రిలీజ్ - పడి లేచినవాడితో పందెం ప్రమాదకరం
యంగ్ హీరో నాగశౌర్య నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఇక ఈ సందర్భంగా నాగశౌర్య సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే వరుడు కావలెను సినిమా నుండి నాగ శౌర్య ఇంట్రడక్షన్ వీడియో ను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సినిమా 'లక్ష్య' నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
"లక్ష్య "మూవీ అప్ డేట్
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా విలు విద్య నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో "రొమాంటిక్ "మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక కాగా జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

"#NTR30" మూవీ లో కేతిక శర్మ ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "#NTR30"మూవీ రూపొందనుంది. మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్ళే ఈ మూవీ కై దర్శకుడు త్రివిక్రమ్ నటీ నటులను ఎంపిక చేస్తున్నారు. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా కేతిక శర్మ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

సుకుమార్ తో మరో ఛాన్స్ కొట్టేసిన 'ఉప్పెన' హీరోయిన్..!
ఒక పక్క పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే... మరోపక్క చిన్న హీరోలకు కథలను అందిస్తూ తన నిర్మాణ సంస్థలోనే సినిమాలు తెరకెక్కిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉప్పెన సినిమా లైన్ లో ఉంది. సుకుమార్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ అమ్మడికి సుకుమార్ మరో సినిమాలో నటించే అవకాశం దక్కినట్టు…
ఒక్క సినిమాకే సుకుమార్ సినిమాలో ఛాన్స్..!
ఇంకా తాను చేస్తున్న సినిమారిలీజ్ కూడా అవ్వలేదు అప్పుడే సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది పూరీ హీరోయిన్. పూరి జగన్నాథ్ నిర్మాణంలో రూపొందుతున్న ‘రొమాంటిక్’ సినిమా ద్వారా కేతిక శర్మ పరిచయమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మొదటి సినిమాలోనే ఈ భామ గ్లామర్ డోస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే విడుదల చేసిన పాటను చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ఇంకా సినిమా మొత్తం ఎలా ఉంటుందో చూడాలి.