సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమా లక్ష్య. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో జగపతిబాబు ‘పార్ధసారధి’ అనే పాత్రను పోషిస్తున్నట్టు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Introducing the legendary @IamJagguBhai as Parthasaradhi in #Lakshya!
🏹#𝐋𝐚𝐤𝐬𝐡𝐲𝐚𝐬𝐅𝐫𝐢𝐝𝐚𝐲🏹@IamNagashaurya #KetikaSharma @AsianSuniel @sharrath_marar @nseplofficial @Santhosshjagar1 @RaamDop @kaalabhairava7 pic.twitter.com/RhIeyR2Gct
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 20, 2021
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగశౌర్య పార్థూ అనే పాత్రలో నటిస్తున్నాడు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం నాగ శౌర్య “పోలీస్ వారి హెచ్చరిక, నారి నారి నడుమ మురారి, ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయి” వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలను కూడా త్వరలోనే పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: