హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే.”ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించడం తో వైష్ణవ తేజ్ పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన మూవీ లో వైష్ణవ తేజ్ కథానాయకుడిగా నటించారు. సీనియర్ హీరోయిన్ రకుల్ సింగ్ కథానాయికగా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ప్రముఖ నిర్మాత బివి ఎస్ ఎన్ నిర్మాణ సారధ్యంలో సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి” తమిళ రీమేక్ “ఆదిత్య వర్మ “మూవీ ఫేమ్ గిరీశయ్య దర్శకత్వంలో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం. హీరోయిన్ కేతిక శర్మ ప్రస్తుతం నాగశౌర్య హీరో గా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పలు మూవీస్ చర్చలదశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: