యంగ్ హీరో నాగశౌర్య నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఇక ఈ సందర్భంగా నాగశౌర్య సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే వరుడు కావలెను సినిమా నుండి నాగ శౌర్య ఇంట్రడక్షన్ వీడియో ను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సినిమా ‘లక్ష్య’ నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ ను చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఆర్చరీ చుట్టూ కథ తిరగబోతోందని అర్థమైపోతుంది. చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఎవడో ఒకడు పుడతాడు,.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు” అనే జగపతి బాబు డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఇక ఆర్చరీ ఆటకే గుర్తింపు తెచ్చిన పార్థూ.. ఆటకు దూరం అవ్వడం, తిరిగి.. బరిలోకి దిగడం.. ఇదంతా టీజర్‌లోనే చూపించేశారు. నాగశౌర్య పాత్రలో షేడ్స్ ఉన్నాయన్న విషయం టీజర్‌లోనే అర్థం అవుతోంది. ”పడి లేచినవాడితో పందెం.. ప్రమాదకరం” అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.. సినిమా ఈ రేంజ్ లో ఉంటుందో చూడాలి..
#Lakshya The journey that made him a champion!
Lakshya Teaser is out now: https://t.co/yshnGNFY5I@IamNagashaurya @sharrath_marar @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @RaamDop @IamJagguBhai @EditorJunaid #KetikaSharma @kaalabhairava7 @harshachemudu @SachinSKhedekar pic.twitter.com/SfjbvSzTzg
— Northstar Entertainment (@nseplofficial) January 22, 2021
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: