యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “#NTR30″మూవీ రూపొందనుంది. మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్ళే ఈ మూవీ కై దర్శకుడు త్రివిక్రమ్ నటీ నటులను ఎంపిక చేస్తున్నారు. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా కేతిక శర్మ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రొమాంటిక్ ” మూవీ తో సింగర్ , మోడల్ , యూట్యూబర్ కేతిక శర్మ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కేతిక శర్మ టాలీవుడ్ లో పలు మూవీస్ ఆఫర్స్ అందుకుంటున్నారు. నాగశౌర్య హీరోగా రూపొందుతున్న “#NS20 ” మూవీ లో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న “అల్లుడు అదుర్స్ “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఇప్పుడు స్టార్ హీరో ఎన్టీఆర్ కు జోడీగా ఎంపిక కావడంతో కేతిక శర్మకు స్టార్ డమ్ దక్కే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: