ఇతర భాషా కథానాయికలు టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హిందీ తర్వాత జాతీయస్థాయిలో పెద్ద మార్కెట్ కలిగిన టాలీవుడ్‌పై కొత్త కథానాయికలు ఆసక్తి చూపుతారు. కొత్త కథానాయికలు నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకొనడం విశేషం. అడివిశేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన “మేజర్ ” మూవీ తో “దబంగ్ 3” బాలీవుడ్ మూవీ బ్యూటీ సయీ మంజ్రేకర్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న “గని “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న “రొమాంటిక్” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న కేతిక శర్మ , నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందనున్న మూవీ కి కేతిక శర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న మీనాక్షి చౌదరి , రవితేజ ‘ఖిలాడీ’, అడివిశేష్ ‘హిట్-2’ సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నారు. కె . రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న “పెళ్లిసందD ” మూవీ తో పరిచయం అవుతున్న కన్నడ నటి శ్రీలీల త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందించనున్న చిత్రంలో కథా నాయికగా ఎంపిక అయ్యారు. విజయ్ దేవరకొండ “లైగర్ “మూవీ తో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ,నాగశౌర్య హీరోగా రూపొందే మూవీ లో న్యూజిలాండ్ సింగర్ షిర్లీ సేతియా , “గాడ్సే ” మూవీ తో మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: