సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా విలు విద్య నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక కాగా జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“లక్ష్య “మూవీలో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ తో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. ఇప్పటి వరకూ 70 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న “లక్ష్య ” మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ జనవరి 4 వ తేదీ ప్రారంభం కానుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలతో చిత్రయూనిట్ హీరో నాగశౌర్య మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఈ మూవీ తో పాటు హీరో నాగశౌర్య “వరుడు కావలెను “, అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: