
ట్యాగ్ · 66 కథనాలు


త్వరలో అభిమానులను కలవనున్న ఎన్టీఆర్

వార్ 2 కోసం ముంబైకి ఎన్టీఆర్

ఆయ్ టీమ్ తో మ్యాన్ ఆఫ్ మాస్

నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు ఎన్టీఆర్ అభినందనలు

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. స్పెషల్ స్టోరీ

2024 సెకండాఫ్ లో స్టార్ హీరోల జాతర

ఎన్టీఆర్ 31 అప్డేట్

ఎన్టీఆర్ తో వర్క్ చేస్తా అంటున్న హాలీవుడ్ మేకర్

గోవాకు నాని ,ఎన్టీఆర్

వైరల్ గా క్లాస్ లుక్ లో ఎన్టీఆర్

#NTR30 భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు

ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ క్షమాపణ

బ్రహ్మాస్త్రం కోసం కొమరం భీముడు

మహానటి లో అందుకే ఎన్టీఆర్ ను తీసుకోలేదు
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్ డేట్

ఎన్టీఆర్ నీల్ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అవుట్‌పుట్ విషయంలో కొన్ని మార్పులు, రూమర్స్ వచ్చినా, చిత్ర యూనిట్ అవన్నీ పక్కనపెట్టి కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఎన్టీఆర్ కటౌట్‌కి పుష్పాభిషేకం చేసిన జపాన్ లేడీ ఫ్యాన్స్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'దేవర పార్ట్ 1' చిత్రం త్వరలో జపాన్‌లో విడుదలవుతోంది. మార్చి 28న ఈ మూవీ జపనీస్ భాషలో జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. అయితే జపాన్‌లో జూనియర్‌కి విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు అక్కడ లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఈ క్రమంలో దేవర మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని తారక్ అభిమానులు ధీమాగా ఉన్నారు.

త్వరలో అభిమానులను కలవనున్న ఎన్టీఆర్
టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ప్రెస్ నోట్ విడుదలచేసింది. కాగా తారక్ తన అభిమానులు కలిసి లేదా నేరుగా చూసి చాలా కాలం అవుతోంది. అప్పుడెప్పుడో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలవడమే.

వార్ 2 కోసం ముంబైకి ఎన్టీఆర్
ఇన్ని రోజులు దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా వార్ 2 షూటింగ్ లో బిజీ అవుతున్నాడు.అందులో భాగంగా రీసెంట్ గా ఓ మినీ షెడ్యూల్ ను పూర్తి చేసిన ఎన్టీఆర్ ఈ రోజు మళ్ళీ మరో షెడ్యూల్ కోసం ముంబై వెళ్ళాడు.వచ్చే వారం వరకు ఈ షెడ్యూల్ జరుగనుందని టాక్.మరోవైపు హృతిక్ రోషన్ తన పార్ట్ సంబంధించిన షూటింగ్ ను ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు.వార్ 2లో ఎన్టీఆర్ ,హృతిక్ హోరాహోరిగా తలపడనున్నారని తెలిసిందే.బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ గొప్ప మనస్సు.. తెలుగు రాష్ట్రాలకు భారీ సాయం
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక సందర్భాల్లో అవసరంలో ఉన్నవారికి అండగా ఉన్న ఆయన తాజాగా మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా వరదలు ముంచెత్తి చాలా ప్రాంతాలు జల దిగ్బంధం అయ్యాయి.

ఆయ్ టీమ్ తో మ్యాన్ ఆఫ్ మాస్
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. ఇప్పుడు ఆయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంజి కే దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు ఎన్టీఆర్ అభినందనలు
నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీనిలో తెలుగు సినిమాల్లో కేవలం ఒక్క సినిమాకు మాత్రమే ఈ అవార్డ్ దక్కింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరిలో బలగంతో పాటు ‘కార్తికేయ 2’, ‘మేజర్’, ‘సీతారామం’ పోటీలో నిలవగా.. కార్తికేయ 2 ఈ అవార్డును గెలుచుకుంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా ‘గుల్‌మోహర్’, ఉత్తమ కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్2’, ఉత్తమ తమిళ సినిమా ‘పొన్నియన్ సెల్వన్-1’ అవార్డులు గెలుచుకుంది.

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. స్పెషల్ స్టోరీ
జూనియర్ ఎన్టీఆర్.. తెలుగునాట పరిచయమే అక్కరలేని పేరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా, ఆ కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. రూపంలో తన తాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలు కలిగిన జూనియర్.. నటనలో కూడా తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. తనదైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు. కాగా నేడు జూ. ఎన్టీఆర్ జన్మదినం.. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ గురించి స్పెషల్ స్టోరీ..

2024 సెకండాఫ్ లో స్టార్ హీరోల జాతర
ప్రతి ఏడూ ఎన్నో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని సీజన్లలో మాత్రం సినిమాల సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి పండుగ. ఈపండుగకు పెద్ద పెద్ద సినిమాలు బరిలో దిగుతుంటాయి.. ఆ తరువాత ఫిబ్రవరి, మార్చిలో ఫ్లో కాస్త తగ్గినా సమ్మర్ కు మాత్రం మళ్లీ జోరు పెరుగుతుంది. ఇలా సీజన్ ను బట్టి సినిమాల రిలీజ్ కు ఉంటాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతికి బాగానే రిలీజ్ అయినా.. సమ్మర్ సీజన్ మాత్రం కాస్త నిరాశ పరిచింది అని చెప్పొచ్చు. వెరసి ఫస్ట్ హాఫ్ లో అంతంత మాత్రంగానే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సెకండాఫ్ గురించి. ఇక…

ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్.. నెట్టింట వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోలు, 'ఆర్ఆర్ఆర్' కో స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు ఒకేచోట కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు వీరు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో కలిసి కనిపించారు. వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్‌లో కలుసుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకై బేగంపేట విమానాశ్రయం వద్దకు వచ్చారు. గుజరాత్ లోని జామ్ నగర్‌లో అనంత్ అంబానీ వివాహం జరుగనున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ 31 అప్డేట్
ఎన్టీఆర్ 31 ను అఫిషియల్ గా ప్రకటించేశారు మేకర్స్.కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్నాడు.షూటింగ్ వచ్చే ఏడాది మార్చి లో స్టార్ట్ కానుంది.ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు.మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి.ఇక్కడి వరకు బాగానే వుంది కానీ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వార్ 2 తో ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలిసిందే.నవంబర్ నుండి షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.అలాంటప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్ కి 31 కావాలి కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని ప్రకటించారు.ఆలెక్కన చూస్తే వార్ 2 ఎన్టీఆర్ 32 అవుతుంది.కానీ 31 కంటే ఎన్టీఆర్ ,వార్ 2లో జాయిన్…

ఎన్టీఆర్ తో వర్క్ చేస్తా అంటున్న హాలీవుడ్ మేకర్
ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళితో పాటు ఆ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు కూడా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఎంతో మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సినిమాను చూడటమే కాకుండా వారి నటనపై ప్రశంసలు సైతం కుమ్మరించారు. అంతేకాదు కొంతమంది వారితో వర్క్ చేయాలన్న కోరికను కూడా బయటపెడుతున్నారు. తాజాగా ఈసినిమా చూసిన ఓ సెలబ్రిటీ కూడా ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయి తనతో వర్క్ చేయాలన్న ఆకాంక్షను బయటపెట్టారు. ఆయన ఎవరో కాదు 'గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ' చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్.

గోవాకు నాని ,ఎన్టీఆర్
దసరాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు నాని. ఈసినిమా రేపటితో 100కోట్ల క్లబ్ లోకి చేరనుంది. ఇక నాని తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయనున్నాడు.ఇటీవలే లాంచ్ అయిన ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షెడ్యూల్ గోవాలో జరుగనుంది.ఈలాంగ్ షెడ్యూల్ ఈరోజే ప్రారంభంకానుంది. ఇందుకోసం నాని,గోవా వెళ్లనున్నాడు.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్నఈ సినిమాకి శౌర్యువ్ డైరెక్టర్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్.వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆస్కార్ వేడుకలో నెంబర్ వన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్
అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లో మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ 95 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకను 16. 6 మిలియన్ మంది లైవ్ లో వీక్షించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకొంది. 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా తెలుగు దర్శకుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.

వైరల్ గా క్లాస్ లుక్ లో ఎన్టీఆర్
ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే రిలీజ్ అయి చాలా నెలలు అయిపోయింది. ఎన్టీఆర్ తన తరువాత సినిమా కొరటాల శివతో చేయాల్సి ఉంది. అయితే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇప్పటికే ఆలస్యమైపోయింది. అందుకే అభిమానులు ఎన్టీఆర్ తన సినిమా ఎప్పుడు మొదలుపెడతాడా అని చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడంతో ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారుచేయడం వల్ల కూడా ఆ సినిమా షూటింగ్ కు లేట్ అవుతుంది.

#NTR30 భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు
ఎన్టీఆర్ 30.. ఈసినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే జనతా గ్యారేజ్ వచ్చి మంచి విజయం సాధించింది. దీంతో రెండో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే ఈసినిమా ఈసినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు కానీ అది ఇంతవరకూ జరగలేదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ మరింత ఎక్కువవడంతో కొరటాల శివ తన స్క్రిప్ట్ పై మరింత దృష్టిని పెడుతున్నాడు. ఈసినిమా షూటింగ్ లేట్ అవ్వడానికి ఇది…

ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ క్షమాపణ
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్.. శివ సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈసినిమా విజన్ ఏంటో ఇప్పటికే అయాన్ అలానే రాజమౌళి కూడా వీడియోల ద్వారా తెలియచేశారు. ఆ విజువల్ వండర్ ను స్క్రీన్ పై చూడటమే ఆలస్యం. దానికోసమే అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బ్రహ్మాస్త్రం కోసం కొమరం భీముడు
బాలీవుడ్ నుండి వస్తున్న భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా ఈసినిమా రూపొందించారు. తెలుగులో ఈసినిమా బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9 వ తేదీన రిలీజ్ చేస్తుండగా ఈ చిత్రం ప్రమోషన్స్ గత కొంతకాలంగా జరుగుతున్నాయి. సౌత్ ప్రమోషన్ బాధ్యతలు రాజమౌళి తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.

మహానటి లో అందుకే ఎన్టీఆర్ ను తీసుకోలేదు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ మూవీ మహానటి. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈసినిమా విమర్శకుల ప్రశంసలు అందడమే కాకుండా జాతీయ అవార్డును సైతం దక్కించుకున్నారు. ఇంకా ఈసినిమాలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, అక్కినేని నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్ కీలకపాత్రలలో నటించారు.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్ డేట్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా మాత్రం ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎన్టీఆర్ 30 సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.