ఇన్ని రోజులు దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా వార్ 2 షూటింగ్ లో బిజీ అవుతున్నాడు.అందులో భాగంగా రీసెంట్ గా ఓ మినీ షెడ్యూల్ ను పూర్తి చేసిన ఎన్టీఆర్ ఈ రోజు మళ్ళీ మరో షెడ్యూల్ కోసం ముంబై వెళ్ళాడు.వచ్చే వారం వరకు ఈ షెడ్యూల్ జరుగనుందని టాక్.మరోవైపు హృతిక్ రోషన్ తన పార్ట్ సంబంధించిన షూటింగ్ ను ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు.వార్ 2లో ఎన్టీఆర్ ,హృతిక్ హోరాహోరిగా తలపడనున్నారని తెలిసిందే.బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దేవర ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.బాహుబలి 2&1 తరువాత అత్యధిక షేర్ ను రాబట్టిన మూడో సినిమాగా దేవర రికార్డు సృష్టించింది.వచ్చే నెల రెండో వారం లో నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేలా వుంది.కొరటాల శివ ఈసినిమాను డైరెక్ట్ చేయగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అనిరుధ్ సంగీతం అందించాడు.
ఇక ఎన్టీఆర్, వార్ 2 చేస్తూనే ప్రశాంత్ నీల్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడు.ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు.ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో వున్నారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా 2026 జనవరి 9న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























