గోవాకు నాని ,ఎన్టీఆర్ 

Latest Update about Jr NTR & Nani New Movies

దసరాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు నాని. ఈసినిమా రేపటితో 100కోట్ల క్లబ్ లోకి చేరనుంది. ఇక నాని తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయనున్నాడు.ఇటీవలే లాంచ్ అయిన ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షెడ్యూల్ గోవాలో జరుగనుంది.ఈలాంగ్ షెడ్యూల్ ఈరోజే  ప్రారంభంకానుంది. ఇందుకోసం నాని,గోవా వెళ్లనున్నాడు.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్నఈ సినిమాకి శౌర్యువ్ డైరెక్టర్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్.వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమానే కాకుండా ఎన్టీఆర్ 30(వర్కింగ్ టైటిల్ )కూడా గోవా లో షూటింగ్ జరుపుకోనుంది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ సార్ట్ కాగా మొదటి షెడ్యూల్ శంషాబాద్ లో వేసిన సెట్ లో జరుగుతుంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరుగనుంది. ఈనెల రెండో వారంలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈచిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కొరటాల శివ డైరక్ట్ చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈసినిమా తెలుగు తోపాటు కన్నడ , మలయాళ ,తమిళ ,హిందీ భాషల్లో విడుదలకానుంది.

అలా నాని , ఎన్టీఆర్ తమ సినిమాల కోసం గోవా వెళ్లనున్నారు. ఇద్దరికి 30వ సినిమానే కావడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 2 =