జూనియర్ ఎన్టీఆర్‌ బర్త్ డే.. స్పెషల్ స్టోరీ

Special Story on Jr NTR Birth Day

జూనియర్ ఎన్టీఆర్‌.. తెలుగునాట పరిచయమే అక్కరలేని పేరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా, ఆ కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. రూపంలో తన తాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలు కలిగిన జూనియర్.. నటనలో కూడా తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. తనదైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు. కాగా నేడు జూ. ఎన్టీఆర్‌ జన్మదినం.. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ గురించి స్పెషల్ స్టోరీ..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జూ. ఎన్టీఆర్‌.. నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు 1983 మే 20న జన్మించాడు. తల్లి ప్రోద్బలంతో కూచిపూడి నాట్యం నేర్చుకొని చిన్నవయస్సులోనే పలు వేదికలపై ఎన్నో ప్రదర్శనలు కూడా యిచ్చాడు. ఈ క్రమంలో తన 13వ ఏట ‘బాల రామాయణం’ సినిమాతో తొలిసారి వెండితెరపై అరంగేట్రం చేసిన తారక్.. మొదటి సినిమాతోనే నంది అవార్డును కైవసం చేసుకున్నాడు. అనంతరం 2001లో 17 వయస్సులో ‘నిన్ను చూడాలని’ అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి మొదటిసారి దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ నెం.1’తో తొలి విజయం అందుకున్నాడు.

అయితే మూడో సినిమా ‘సుబ్బు’తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఎన్టీఆర్.. నాలుగో సినిమాగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంలో తారక్ నటన చూసిన ఆడియెన్స్ షాక్ అయ్యారు. నందమూరి అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. ఇక ఆ తర్వాత మరోసారి రాజమౌళితో జతకట్టి ‘సింహాద్రి’ చేశాడు. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయి తారక్ కి ఫుల్ మాస్ ఫాలోయింగ్ తెచ్చింది. ఇక ఇక్కడినుంచి ఎన్టీఆర్ కెరీర్ ఎన్నో ఉద్ధానపతనాలు చవిచూసింది.

‘యమదొంగ’, ‘అదుర్స్’, ‘బృందావనం’. ‘బాద్ షా’ తదితర చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు. అయితే మధ్య మధ్యలో ‘ఆంధ్రావాలా’, ‘సాంబ’, ‘నా అల్లుడు’, ‘నరసింహుడు’, ‘అశోక్’, ‘శక్తి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలను సాధించలేదు. అలాగే ‘రాఖీ’, ‘ఊసరవెల్లి’, ‘దమ్ము’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రభస’ మూవీస్ ఎన్టీఆర్ కెరీర్ కి హెల్ప్ అవలేకపోయాయి. ఈ క్రమంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ చిత్రంతో తారక్ మళ్ళీ సక్సెస్ బాట పాతాడు. అప్పటినుంచి వరుసగా.. ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు.

ఇదేక్రమంలో ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌తో కలిసి ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు పొందిందో అందరికి తెలిసిందే. ప్రత్యేకించి అందులోని ‘నాటు నాటు’ పాటలో తారక్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కరినీ ఉర్రూతలూగించాయి. అంతేకాకుండా ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ అవార్డు గెలుచుకుని రికార్డ్ సృష్టించింది. తద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వేదికపై ఘనంగా చాటారు.

ఇక ఇదిలావుండగా.. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రిలీజవనున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రముఖ హిందీ న‌టుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా న‌టిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా తొలిభాగం ఈ ఏడాది అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా మూవీ లవర్స్‌ను ఆక‌ట్టుకున్నాయి.

ఈ క్రమంలోనే నేడు తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. జూనియర్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందించింది చిత్ర బృందం. మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ ‘ఫియర్’ను లాంఛ్ చేయ‌గా యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇక ఈ మూవీలో ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, టామ్‌ షైన్‌ చాకో, నరైన్‌ తదితరులు నటిస్తుండగా.. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కె గ్రాండ్‍గా నిర్మిస్తున్నారు. తెలుగు సహా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయనుండగా.. హిందీలో ఈ చిత్రాన్ని స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ స్వయంగా విడుదల చేస్తుండటం గమనార్హం. ఇక దీనితోపాటుగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రం.. అలాగే హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో ఎన్టీఆర్‌ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.