బ్రహ్మాస్త్రం కోసం కొమరం భీముడు

Jr NTR To Grace Brahmastra Movie Pre Release Event,Brahmastra Pre Release Event Details: “Man Of Masses” Jr NTR For Brahmastra As Chief Guest,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Movie Pre Release Event,Brahmastra Movie Latest Updates on Pre Release Event,Brahmastra Movie Promotions,Brahmastra New Movie Updates,Brahmastra Movie Pre Release Event Chief Guest Jr NTR,Man Of Masses Jr NTR To Attend Brahmastra Pre Release Event,Brahmastra Pre Release Event Details,Jr NTR Upcoming Movies,Jr NTR New Movie Updates,Jr NTR latest Movie Updates,Jr NTR For Brahmastra as A Chief Guest

బాలీవుడ్ నుండి వస్తున్న భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా ఈసినిమా రూపొందించారు. తెలుగులో ఈసినిమా బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9 వ తేదీన రిలీజ్ చేస్తుండగా ఈ చిత్రం ప్రమోషన్స్ గత కొంతకాలంగా జరుగుతున్నాయి. సౌత్ ప్రమోషన్ బాధ్యతలు రాజమౌళి తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇక్కడ ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు. అయితే ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నట్టు వార్తలు జోరుగా సాగాయి. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ బ్రహ్మాస్త్రం మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఇక ఈ ఈవెంట్ సెప్టెంబర్ 2 న హైదరాబాద్ లోని రామోజీఫిలిం సీటిలో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభంకానుంది.

కాగా ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 6 =