మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అవుట్‌పుట్ విషయంలో కొన్ని మార్పులు, రూమర్స్ వచ్చినా, చిత్ర యూనిట్ అవన్నీ పక్కనపెట్టి కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
కొత్త షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ తన హెయిర్ స్టైలిస్ట్‌తో సిద్ధమవుతున్న ఫోటోను కూడా యూనిట్ విడుదల చేసింది, దీనిని బట్టి ఆయన ఈ సినిమాలో రెండు విభిన్నమైన లుక్‌లలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ భారీ షెడ్యూల్‌ను నార్తర్న్ యూరప్‌లోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇది దర్శకుడు ప్రశాంత్ నీల్ కెరీర్‌లోనే మొట్టమొదటి అంతర్జాతీయ షెడ్యూల్ కానుంది.ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు.ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. ఈసినిమాను వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ఇంతకుముందే ప్రకటించారు.అయితే షూటింగ్ఆలస్యం అవుతుండడం తో ఆ డేట్ కి రావడం అనుమానమే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























