ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే రిలీజ్ అయి చాలా నెలలు అయిపోయింది. ఎన్టీఆర్ తన తరువాత సినిమా కొరటాల శివతో చేయాల్సి ఉంది. అయితే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇప్పటికే ఆలస్యమైపోయింది. అందుకే అభిమానులు ఎన్టీఆర్ తన సినిమా ఎప్పుడు మొదలుపెడతాడా అని చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడంతో ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారుచేయడం వల్ల కూడా ఆ సినిమా షూటింగ్ కు లేట్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోపక్క ఇప్పటికే ఎన్టీఆర్ కొత్త మేకోవర్ కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా మరో ఫొటో వైరల్ అవుతుంది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయిన అవినాష్ గోవారికర్ ఎన్టీఆర్ క్లాస్ లుక్‌ను షేర్ చేశారు. ఈ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. గ్లాసెస్ మరియు సూట్ లో స్టైలిష్ లుక్ లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోకు సోషల్ మీడయా వేదికగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. మరి జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఇప్పటినుండే ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: