ఎన్టీఆర్ 31 ను అఫిషియల్ గా ప్రకటించేశారు మేకర్స్.కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్నాడు.షూటింగ్ వచ్చే ఏడాది మార్చి లో స్టార్ట్ కానుంది.ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు.మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి.ఇక్కడి వరకు బాగానే వుంది కానీ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వార్ 2 తో ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలిసిందే.నవంబర్ నుండి షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.అలాంటప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్ కి 31 కావాలి కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని ప్రకటించారు.ఆలెక్కన చూస్తే వార్ 2 ఎన్టీఆర్ 32 అవుతుంది.కానీ 31 కంటే ఎన్టీఆర్ ,వార్ 2లో జాయిన్ కానున్నాడని టాక్.త్వరలోనే ఈసినిమా విషయంలో క్లారిటీ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #NTR31 wishes @tarak9999 a very Happy Birthday 🔥🔥
On to the sets from March 2024 💥💥#HappyBirthdayNTR#PrashanthNeel @NTRArtsOfficial pic.twitter.com/Mi769WTE2o
— Mythri Movie Makers (@MythriOfficial) May 20, 2023
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్,కొరటాల శివ డైరెక్షన్ లో తన 30వ సినిమాలో నటిస్తున్నాడు.నిన్న ఈసినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.సుధాకర్ మిక్కిలినేని,హరికృష్ణ నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: