మహానటి లో అందుకే ఎన్టీఆర్ ను తీసుకోలేదు

Ashwini Dutt Reveals Why Jr NTR Was Not Part of Mahanati Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Mahanati Movie, Mahanati Telougu Movie,Ashwini Dutt,Ashwini Dutt About Jr NTR,Ashwini Dutt Reveals About Jr NTR,Ashiwni Dutt Comment on Jr NTR Not Be a Part of Mahanati Movie,Ashwini Dut Upcoming Movies,Ashwini Dutt Movie Updates,Ashwin Dutt About Mahanati Movie,Jr NTR Upcoming Movies,Jr NTR New Movie Updates

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ మూవీ మహానటి. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది. అంతేకాదు ఈసినిమా విమర్శకుల ప్రశంసలు అందడమే కాకుండా జాతీయ అవార్డును సైతం దక్కించుకున్నారు. ఇంకా ఈసినిమాలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, అక్కినేని నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్ కీలకపాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే సావిత్రి అంటే వెంటనే ఆమెతో నటించిన హీరోల్లో మొదటగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ కూడా. ఈసినిమాలో అప్పట్లో ఎంతోమంది నటీనటుల పాత్రలను ఇప్పుడున్న కొంతమంది ప్రముఖ నటులతో అలానే వారసత్వనటులతో నటింపచేశారు. ఉదాహరణకు ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య నటించాడు. కానీ ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కాకుండా వేరే నటుడు నటించాడు. ఈసినిమా మొదలైనప్పుడు ఎన్టీఆర్ పాత్రలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆరే నటిస్తాడని అనుకున్నారు కానీ మేకర్స్ వేరే వ్యక్తితో చేియంచేశారు.

అయితే తాజాగా అసలు ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు తీసుకోలేదో చెబుతున్నాడు నిర్మాత అశ్వినీదత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వినీ దత్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్‏తో చేయిద్దామని అనుకున్నాం. కానీ అప్పటికే బాలకృష్ణగారు ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించారు. దీంతో మా సినిమాలో ఎవరిని పెట్టి తీసినా తప్పుగా భావిస్తారేమోననిపించింది. ఒకవేళ ఎన్టీఆర్ ను పెట్టి తీసినా బాగుండదేమోనని అనుకున్నాం. ఇదే విషయాన్ని నాగ్అశ్విన్‏తో చెప్పగా.. అసలు ఎన్టీఆర్ పాత్ర లేకుండానే సినిమా చేస్తాను అన్నారు. అలా ఆ పామును పట్టుకునే ఒకే షాట్ పెట్టాం అని క్లారిటీ ఇచ్చారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here