నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీనిలో తెలుగు సినిమాల్లో కేవలం ఒక్క సినిమాకు మాత్రమే ఈ అవార్డ్ దక్కింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరిలో బలగంతో పాటు ‘కార్తికేయ 2’, ‘మేజర్’, ‘సీతారామం’ పోటీలో నిలవగా.. కార్తికేయ 2 ఈ అవార్డును గెలుచుకుంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా ‘గుల్‌మోహర్’, ఉత్తమ కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్2’, ఉత్తమ తమిళ సినిమా ‘పొన్నియన్ సెల్వన్-1’ అవార్డులు గెలుచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే తాజాగా నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆభినందనలు తెలిపారు. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న చందూ మొండేటి, నిఖిల్ సిద్ధార్థ్ మరియు కార్తికేయ2 టీమ్ మొత్తానికి అభినందనలు. అలాగే, దేశ వ్యాప్తంగా జాతీయ అవార్డు గ్రహీతలందరికీ మంచి గుర్తింపు లభించినందుకు నా హృదయపూర్వక అభినందనలు అంటూ తన ట్విట్టర్ లో తెలియచేశాడు.
ఇంకా కాంతార కు ఉత్తమ నటుడిగా గెలుపొందినందుకు రిషబ్ శెట్టి కి అభినందనలు. మీ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ నాకు గూస్‌బంప్స్ ఇస్తోంది. కన్నడ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు ప్రశాంత్ నీల్, యష్ మరియు KGF2 మొత్తం టీమ్‌కు అభినందనలు అంటూ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: