ఎన్టీఆర్ గొప్ప మనస్సు.. తెలుగు రాష్ట్రాలకు భారీ సాయం

Jr NTR Donates Rs 50 Lakhs For Flood Victims of AP and Telangana States

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక సందర్భాల్లో అవసరంలో ఉన్నవారికి అండగా ఉన్న ఆయన తాజాగా మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా వరదలు ముంచెత్తి చాలా ప్రాంతాలు జల దిగ్బంధం అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విపత్తు వలన వేలాదిమందికి నీడ లేకుండాపోయింది. కొన్ని జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడి ప్రజలకు గత మూడు రోజులుగా సరైన ఆహారం కూడా అందుబాటులో లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు ఎన్టీఆర్ ముందుకొచ్చారు. తనవంతు సాయంగా ఒక్కోదానికి రూ.50 లక్షలు చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి భారీ సాయం ప్రకటించారు.

కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ‘దేవర’ ఈనెల 27న ప్రేక్షకులముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ తదితరులు ఇత‌ర పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో భారీ అంచ‌నాల‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. కాగా హై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ‘దేవర’ను రెండు భాగాలుగా రూపొందిస్తుండగా.. ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.