మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర పార్ట్ 1’ చిత్రం త్వరలో జపాన్‌లో విడుదలవుతోంది. మార్చి 28న ఈ మూవీ జపనీస్ భాషలో జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. అయితే జపాన్‌లో జూనియర్‌కి విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు అక్కడ లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఈ క్రమంలో దేవర మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని తారక్ అభిమానులు ధీమాగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే మార్చి 19న ఓ ప్రముఖ నగరంలో ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. అక్కడ ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం గమనార్హం. ఇక త్వరలో ఎన్టీఆర్ కూడా జపాన్‌లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడి లేడీ ఫ్యాన్స్ హడావిడి చేశారు. దేవర సినిమాకి సంబంధించిన ఎన్టీఆర్ కటౌట్‌కి పువ్వులతో అభిషేకం చేశారు అమ్మాయిలు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ రోల్‌లో నటించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. తొలి రెండు, మూడు రోజులు కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ, ఓవర్ సీస్ లోనూ అదరగొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా 510 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తద్వారా ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో ఫస్ట్ 500 కోట్ల మూవీగా నిలిచింది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: