త్వరలో అభిమానులను కలవనున్న ఎన్టీఆర్

Jr. NTR Office Released Key Press Note To His Fans

టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానులను ఉద్దేశించి కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ప్రెస్ నోట్ విడుదలచేసింది. కాగా తారక్‌ తన అభిమానులు కలిసి లేదా నేరుగా చూసి చాలా కాలం అవుతోంది. అప్పుడెప్పుడో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలవడమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా విడుదల సమయంలో అభిమానులను కలిశారు. ఇటీవలికాలంలో అయితే అభిమానులను నేరుగా కలిసిన సందర్భమే లేదు. రీసెంట్‌గా ‘దేవర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఏర్పాటుచేయగా.. అనూహ్య కారణాల రీత్యా ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఆ సినిమా ఘనవిజయం అనంతరం ఆంధ్రాలో మరోసారి సక్సెస్ మీట్ నిర్వహించ తలపెట్టగా అనుమతుల్లేని కారణంగా అది కూడా రద్దు చేయాల్సివచ్చింది. దీంతో తారక్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఎలాగైనా తమ అభిమాన హీరోను కలవాలని భావించిన కొందరు ఫ్యాన్స్ పాదయాత్రలు వంటివి చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు. అతి త్వరలోనే ఫ్యాన్స్ అందరినీ కలుస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ నిర్వహించుకుందామని, అందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుందామని తెలిపారు. ఇక ఈ సందర్భంగా అభిమానులు తన మీద చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.