ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. ఇప్పుడు ఆయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంజి కే దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్నో పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా రిలీజ్ అయినా కూడా ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాదు సెలబ్రిటీలు సైతం ఈసినిమాపై స్పందిస్తూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా తానే చిత్రయూనిట్ ను కలిసి అభినందనలు తెలిపారు. నిర్మాత బన్నీ వాస్, నార్నే నితిన్, నయన్ సారిక, దర్శకుడు అంజి కె మణిపుత్ర మరియు మొత్తం టీమ్ ని కలిసి ప్రశంసించారు.
కాగా ఈసినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. రామ్ మిరియాల సంగీతం అందించగా.. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ గా, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























