
ట్యాగ్ · 242 కథనాలు · పేజీ 12


'ఎన్టీఆర్' సినిమాలో 'శివగామి'..!

బాలకృష్ణకు చిరు, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రికార్డ్

తాత జయంతి కి ఎన్టీఆర్ ఎమోషనల్

కరోనా ను జయించిన "కొమరం భీమ్ "

'ఎన్టీఆర్' కు 'థమన్' స్పెషల్ విషెస్

నా భీమ్ హృదయం బంగారం

ఎన్టీఆర్ కు" #NTR30 " టీమ్ బర్త్ డే విషెస్

అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం

బర్త్ డే కి #NTR31 అప్ డేట్..?

'ఆర్ఆర్ఆర్' 10 ఏళ్ల కల..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై విశ్వక్ సేన్ ప్రశంసలు

ఎన్టీఆర్ కథ మొదలుపెట్టిన కొరటాల

'ఆర్ఆర్ఆర్'.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్న జక్కన్న
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఆసినిమా అంత వెనక్కి వెళుతుంది. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు కానీ అది కూడా అవ్వదని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇంకా షూటింగ్ కూడా పూర్తవ్వలేదు.. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంటుంది..రాజమౌళి కరెక్ట్ అవుట్ పుట్ వచ్చేంతవరకూ ఒక పట్టాన వదిలే రకం కూడా కాదు. అక్టోబర్ లో సినిమా రావడం కష్టమే. దీంతో అక్టోబర్‌లో అయితే ఉండదని దాదాపు ఫిక్స్ అయ్యారు అందరూ.

'ఎన్టీఆర్' సినిమాలో 'శివగామి'..!
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' మూవీ తెరకెక్కిస్తున్నాడు. గత రెండేళ్లుగా కొరటాల ఇదే సినిమా పై పనిచేస్తున్నాడు. నిజానికి గతేడాది విడుదల కావాల్సిన ఆచార్య మూవీ.. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి వాయిదాపడుతూ వచ్చింది. ఆఖరికి ఈ ఏడాది మేలో రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్రకటించగా.. ఈసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. చివరిదశలో ఉన్నటువంటి ఆచార్య షూటింగ ఆగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లేనందున ఆ సమయాన్ని ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం కేటాయిస్తున్నాడు.

బాలకృష్ణకు చిరు, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్
మొత్తానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వచ్చేసింది. బాలకృష్ణ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక ఈ సందర్భగా బాలకృష్ణకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు అందరూ. ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. మరోవైపు తన సినిమాల అప్ డేట్లతో సోషల్ మీడియాలో నందమూరి హడావుడి మొదలైంది.

'ప్రశాంత్ నీల్' కు ప్రభాస్, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్
నేడు కె.జి.యఫ్ డైరెక్టర్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అంతేకాదు కె.జియఫ్, సలారా నిర్మాణ సంస్థ అయిన హోంబలె ఫిలిమ్స్ ఒక ట్రిబ్యూట్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. అందులో ప్రశాంత్ నీల్ గురించి బాగానే ఎలివేషన్ ఇచ్చారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రికార్డ్
"నిన్ను చూడాలని "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ "స్టూడెంట్ నెం 1 "మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "టెంపర్ "మూవీ తో ఎన్టీఆర్ వరస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్టీఆర్ కు అభిమాన గణం అధికమే. అభిమానులు ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.

తాత జయంతి కి ఎన్టీఆర్ ఎమోషనల్
నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మొత్తం ఆ నట సార్వభౌముడిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాత నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ ద్వారా తాతను గుర్తుచేసుకున్నాడు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది… మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది… పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకి పో తాతా… సదా మీ ప్రేమకు బానిసను… నందమూరి తారకరామారావు” అంటూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మాత్రం అందరినీ హత్తుకుంటుంది.

కరోనా ను జయించిన "కొమరం భీమ్ "
కరోనా టెస్ట్ లో ఎన్టీఆర్ కు పాజిటివ్ రావడం తో అభిమానులతో పాటు సినిమా ప్రముఖులు , బంధువులు ఆందోళనకు గురి అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ఎన్టీఆర్ తనకు నెగటివ్ వచ్చిందనే శుభవార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాననీ , అంతే కాకుండా తన ఆరోగ్యం కోసం స్పెషల్ కేర్ తీసుకున్న వైద్యులకు కూడా స్పెషల్ థాంక్స్ తెలిపారు.

'ఎన్టీఆర్' కు 'థమన్' స్పెషల్ విషెస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నిన్న జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు.. అలాగే సినీ ప్రముఖులు కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న థమన్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు. అయితే తను మ్యూజిక్ అందించిన అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కు మ్యూజిక్ అందిస్తున్న వీడియో పోస్ట్ చేస్తూ థమన్ కు విషెస్ తెలిపాడు.

నా భీమ్ హృదయం బంగారం
ఆర్ఆర్ఆర్.. ఈసినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ఎంతగా ఎదురుచూస్తున్నారో సినిమా రిలీజ్ కూడా అంతగా వెనక్కి వెళుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈసందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి కూడా విదితమే. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఆ పోస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే నేడు ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బళ్ళెంతో గురి పెట్టిన కొమురం భీం గా సరికొత్త మేకోవర్ లో ఉన్న ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేశారు. కళ్లల్లో ఇంటెన్సిటీ.. పొడవాటి తిలకం.. నీటిలోంచి ఎగురుతూ బల్లెం…

'ఎన్టీఆర్' తో సినిమా కన్ఫామ్ చేసిన 'ప్రశాంత్ నీల్'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు బర్త్‌డే సర్‌ప్రైజ్ లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’నుంచి ఆయన కొత్త లుక్‌ని విడుదల చేశారు.‘నా భీమ్ బంగారు హృదయాన్ని కలిగి ఉన్నాడు. కానీ అతను తిరుగుబాటు చేసినప్పుడు, అతను బలంగా మరి ధైర్యంగా నిలుస్తాడు’ అని ఆర్ఆర్‌ఆర్ టీమ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31వ సినిమా ఉంటుందని గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవి వార్తలుగానే ఉంటాయేమో ఈసినిమా గురించి అధికారిక ప్రకటన ఇప్పట్లో ఉండదేమో అనుకున్నారు అందరూ. కానీ అందరికీ…

ఎన్టీఆర్ కు" #NTR30 " టీమ్ బర్త్ డే విషెస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ మూవీస్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల , ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన “జనతా గ్యారేజ్ “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2 నేషనల్ , 7 నంది అవార్డ్స్ గెలుచుకుంది.

'ఆర్ఆర్ఆర్' నుండి ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్
రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగాహీరో రామ్ చరణ్ ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా ఇక ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రేపు మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ పేరు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు కొన్ని సూచనలు చేశారు ఎన్టీఆర్. తన బర్త్ డేకు సంబంధించి…

అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే మే 20వ తేదీన అభిమానులు భారీ హంగామా చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వేళ తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు .అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. త్వరలోనే కోలుకొని కోవిడ్‌ను జయిస్తాను అని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ, చేసే సేవా కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా…

బర్త్ డే కి #NTR31 అప్ డేట్..?
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ రిలీజ్ పై కన్ఫ్యూజన్ మాత్రం అలానే ఉంది. ఇప్పటికే రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. కావాలని చేసినా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లన కారణాలు ఏదైనా దాని ఎఫెక్ట్ మాత్రం సినిమా రిలీజ్ పై పడుతుంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైంది.. జక్కన్న ను నమ్ముకుని సినిమా చేసేందుకు బప్పుకున్న ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఈసినిమాకే లాక్ అయిపోయారు... మరోవైపు ఫ్యాన్స్ తొందరపెడుతున్నారు.. దానికితోడు కరోనా వచ్చి పెద్ద సమస్యగా మారింది.. అసలే లేట్ అయిపోతుంది అనుకుంటే..దీనివల్ల మరింత లేట్ అయింది.. ఇక ఈఏడాది అక్టోబర్ 13న రిలీజ్ చేద్దామని…

అభిమానులకు ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "NTR30 "మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1" మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది.

'ఆర్ఆర్ఆర్' 10 ఏళ్ల కల..!
రాజమౌళి తో సినిమా అంటే ప్రతి ఒక్కహీరోకి చేయాలన్న డ్రీమ్ ఉంటుంది. ఇప్పటికీ పది సినిమాల వరకూ చేశాడు.. అన్ని సినిమాలు సూపర్ హిట్టే.. అప్పటికే డైరెక్టర్ గా రాజమౌళికి మంచి పేరుంది.. ఇక బాహుబలితో తెలుగు సినిమాఖ్యాతిని ప్రపంచస్థాయికి తెలియచేశాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈప్రాజెక్ట్ తన పదేళ్ల డ్రీమ్ అంటున్నాడు రాజమౌళి. ఒక మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలంటే ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కు అంత ఈజీ కాదు.. చాలా కష్టం అందులోనూ ఎన్టీఆర్-చరణ్ మంచి స్నేహితులే అయినా కూడా ఈడ్రీమ్ ఫుల్ ఫిల్ అవ్వడానికి 10ఏళ్లు టైమ్ పట్టింది అని చెప్పుకొచ్చాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల , ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన "జనతా గ్యారేజ్ "మూవీ ఘనవిజయం సాధించింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై విశ్వక్ సేన్ ప్రశంసలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సక్సెస్ ఫుల్ చిత్ర యంగ్ హీరో విశ్వక్ సేన్ వీరాభిమాని అని తెలిసిన విషయమే. ఎన్టీఆర్ హానెస్ట్ యాక్టర్ అనీ ,"సింహాద్రి "మూవీ నుండి ఎన్టీఆర్ ను ఇన్ స్పి రేషన్ గా తీసుకున్నాననీ , తెలుగు భాష పై పట్టున్న నటుడనీ , ప్రతి పదాన్ని ప్రతీ డైలాగ్ ని స్పష్టంగా పలక గల నటుడు ఎన్టీఆర్., నిజాయితీ గల నటుడు. ఆయనకు ఆయనే సాటి'' అనీ , కమర్షియల్ సినిమాలో కూడా కన్వీనియన్స్ యాక్టింగ్ చేయగలిగేది ఎన్టీఆర్ అనీ విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

ఎన్టీఆర్ కథ మొదలుపెట్టిన కొరటాల
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి సినిమాలు అయిపోయిన తరువాత జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇక ఇదిలాఉండగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కథపై పలు వార్తలు వచ్చాయి. పల్లెటూరిలో ఉండే ఓ వ్యక్తి సిటీకి వచ్చి.. అక్కడ అతను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల అప్పటి నుంచి ఆయన ఎలా మారతాడు? అనే పాయింట్ తీసుకొని ఎన్టీఆర్‌ని ప్రేక్షకుల ముందుకు కొరటాల తీసుకొస్తున్నట్టు పలు కథనాలు వచ్చాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్నప్పటి క్లాసికల్ డ్యాన్స్ షో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తన డ్యాన్స్ , ఫైట్స్ , డైలాగ్ డెలివరీ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఆ మూవీ అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. పలుదర్శకుల మూవీస్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.