ఎన్టీఆర్ కథ మొదలుపెట్టిన కొరటాల

Director Koratala Siva Starts Working On The Script Of NTR30

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి సినిమాలు అయిపోయిన తరువాత జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇక ఇదిలాఉండగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కథపై పలు వార్తలు వచ్చాయి. పల్లెటూరిలో ఉండే ఓ వ్యక్తి సిటీకి వచ్చి.. అక్కడ అతను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల అప్పటి నుంచి ఆయన ఎలా మారతాడు? అనే పాయింట్ తీసుకొని ఎన్టీఆర్‌ని ప్రేక్షకుల ముందుకు కొరటాల తీసుకొస్తున్నట్టు పలు కథనాలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా కరోనా వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో ఈగ్యాప్ ను కొరటాల వాడుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ ను కొరటాలను కలిసి బేసిక్ ప్లాట్ చెప్పగా.. అది ఎన్టీఆర్ కు నచ్చడంతో పూర్తి కథ తొందరగా కంప్లీట్ చేయమని చెప్పాడట. మరి ఇంకా కొరటాల కథే స్టార్ట్ చేయలేదు అప్పుడే కథ ఇదంటూ.. అదంటూ కథనాలు వండేశారు.

ఇక గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మూవీ నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చింది. దీంతో మరోసారి ఈ కాంబో మూవీ రానుండటం జనాల్లో ఆసక్తి పెంచేసింది. మరిఈసారి ఏం చేస్తారో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here