యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నిన్న జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు.. అలాగే సినీ ప్రముఖులు కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న థమన్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు. అయితే తను మ్యూజిక్ అందించిన అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కు మ్యూజిక్ అందిస్తున్న వీడియో పోస్ట్ చేస్తూ థమన్ కు విషెస్ తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
This is ❤️ #AravindasamethaBgm 👏🏾🎵 Shot making @tarak9999 anna & the brilliance of our dear director #trivikram gaaru ✊☀️ #HappybirthdayNTR pic.twitter.com/IwkohV2sON
— thaman S (@MusicThaman) May 20, 2021
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా తరువాత కొరటాల శివతో తన 30వ సినిమా చేయనున్నాడు. ఇక నిన్న పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 31వ సినిమాపై కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 వ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
ఇక మరోవైపు థమన్ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం థమన్ చేతిలో నాని టక్ జగదీష్, వరుణ్ తేజ్ బాక్సర్, సర్కారు వారి పాట ఇంకా మెగా స్టార్ లూసిఫర్ రీమేక్ ఇలా చాలా సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: