ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య‘ మూవీ తెరకెక్కిస్తున్నాడు. గత రెండేళ్లుగా కొరటాల ఇదే సినిమా పై పనిచేస్తున్నాడు. నిజానికి గతేడాది విడుదల కావాల్సిన ఆచార్య మూవీ.. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి వాయిదాపడుతూ వచ్చింది. ఆఖరికి ఈ ఏడాది మేలో రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్రకటించగా.. ఈసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. చివరిదశలో ఉన్నటువంటి ఆచార్య షూటింగ ఆగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లేనందున ఆ సమయాన్ని ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం కేటాయిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రతి సినిమాకు ఉండేదే ఈసినిమా విషయంలో కూడా రోజుకో వార్త బయటకు వచ్చింది ఇప్పటికే ఎన్టీఆర్ కోసం పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్నాడని.. స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. ఈసినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం జోరుగా వినిపిస్తుంది. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో నా అల్లుడు సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా.
మరోవైపు ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఈ ఇయర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదనిపిస్తుంది. మరి అటు ఆర్ఆర్ఆర్.. ఇటు ఎన్టీఆర్ 30 సినిమా అటు ఇటుగా రిలీజ్ అవుతాయేమో చూద్దాం.. ఏం జరుగుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: