కరోనా టెస్ట్ లో ఎన్టీఆర్ కు పాజిటివ్ రావడం తో అభిమానులతో పాటు సినిమా ప్రముఖులు , బంధువులు ఆందోళనకు గురి అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ఎన్టీఆర్ తనకు నెగటివ్ వచ్చిందనే శుభవార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాననీ , అంతే కాకుండా తన ఆరోగ్యం కోసం స్పెషల్ కేర్ తీసుకున్న వైద్యులకు కూడా స్పెషల్ థాంక్స్ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy to state that I’ve tested negative for Covid 19. Thank you everyone for all the wishes 🙏🏻
I’d like to take this opportunity to thank my doctors -Dr Praveen Kulkarni & my cousin Dr Veeru from KIMS Hospitals,as well as Tenet Diagnostics. Their excellent care helped me a lot
— Jr NTR (@tarak9999) May 25, 2021
కరోనాను చాలా సీరియస్ గా తీసుకోవాలనీ , అదే సమయంలో ఒక పాజిటివ్ మైండ్ తోమంచి కేర్ తీసుకున్నట్లయితే దానిని జయించవచ్చనీ , అలాగే మన మనోధైర్యమే పెద్ద ఆయుధమనీ అందుకే ఎవరూ కంగారు పడకుండా ఉండాలనీ , ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలనీ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో “NTR30 “మూవీ కి , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: