అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం

Jr NTR Appeals His Fans Not To Celebrate His Birthday This Year Amid Surge In The Cases Of Corona Virus,Telugu Filmnagar,NTR Movie Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR News,Jr NTR Birthday Celebrations,Jr NTR Latest News,Jr NTR Birthday Special,NTR Birthday,Jr NTR Birthday,Jr NTR New Movie,Jr NTR Movie,NTR Movies,Actor Jr NTR,Hero Jr NTR,NTR,Jr NTR Birthday Celebrations News,Jr NTR Requests Fans Not To Celebrate His Birthday,Jr NTR Makes A Humble Request To Fans Ahead Of His Birthday,Jr NTR Requests Fans To Not Celebrate His Birthday,Jr NTR Requests Fans,Jr NTR Fans,Jr NTR Makes A Humble Appeal To All His Fans,NTR's Humble Appeal To His Fans,Jr NTR Makes A Humble Appeal,Jr NTR Fans News,Jr NTR Birthday CDP,NTR Request To All His Fans On His Birthday Eve,Jr NTR's Birthday,Jr NTR On Twitter,Jr. NTR Statement,Jr NTR Health Update,Jr NTR Makes A Request,Jr NTR Request,Jr NTR Humble Appeal To His Fans,Jr NTR Requests His Fans,Jr NTR About Covid-19,Covid-19,Coronavirus,Jr NTR Urged His Fans Not To Celebrate His Birthday,Jr NTR Request To His Fans To Stay Home

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే మే 20వ తేదీన అభిమానులు భారీ హంగామా చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే క‌రోనా వేళ తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు .అభిమానులంద‌రికీ పేరు పేరున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊర‌ట క‌లిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగ‌ల‌ను? ప్ర‌స్తుతం నేను క్షేమంగా ఉన్నాను. త్వ‌ర‌లోనే కోలుకొని కోవిడ్‌ను జ‌యిస్తాను అని ఆశిస్తున్నాను. ప్ర‌తి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ‌, చేసే సేవా కార్య‌క్ర‌మాలు ఒక ఆశీర్వ‌చనంగా భావిస్తాను. కాని ఈ సంవ‌త్స‌రం ఇంటి ప‌ట్టునే ఉంటూ లాక్ డౌన్ లేదా క‌ర్ఫ్యూ నియ‌మాల‌ను పాటిస్తూ జాగ్ర‌త్త‌గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 ఇది వేడుకలు చేసుకునే స‌మ‌యం కాదు. మ‌న‌దేశం క‌రోనాతో యుద్ధం చేస్తుంది. క‌నిపించ‌ని శ‌త్రువుతో అలుపెరుగని పోరాటం చేస్తున్న డాక్ట‌ర్స్, న‌ర్సులు, ఇత‌ర ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు మ‌న సంఘీభావం తెల‌పాలి. ఎంద‌రో త‌మ ప్రాణాల‌ను, జీవ‌నోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాల‌కు కుదిరితే అండ‌గా నిల‌బ‌డాలి.మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్ర‌త్త‌గా ఉండండి. ఒక‌రికి ఒక‌రం సాయం చేసుకుంటూ, చేత‌నైన ఉప‌కారం చేయండి.త్వ‌ర‌లో మ‌న‌దేశం ఈ క‌రోనాను జ‌యిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఆ రోజున మ‌నం అంద‌రం క‌లిసి వేడుక చేసుకుందాం. అప్ప‌టి వ‌ర‌కు మాస్క్ ధ‌రించి జాగ్ర‌త్త‌గా ఉండండి. నా విన్న‌పాన్ని మ‌న్నిస్తార‌ని ఆశిస్తూ మీ ఎన్టీఆర్ అంటూ పెద్ద పోస్ట్ పెట్టారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.