
ట్యాగ్ · 76 కథనాలు


దేవర అలా ఉంటుంది

వార్ 2 -నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్?

ఎన్టీఆర్ సింహాద్రి కోసం మాస్ కా దాస్

ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్డేట్

ఎన్టీఆర్30 సెకండ్ షడ్యూల్ పూర్తి

NTR 30-హైలెట్ గా ఎన్టీఆర్ రెజ్లర్ రోల్

ఎన్టీఆర్ 30షూటింగ్ అప్డేట్

ఎన్టీఆర్ తో వర్క్ చేస్తా అంటున్న హాలీవుడ్ మేకర్

ప్రముఖులకు ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ

వార్ 2 కి సిద్దమైన హృతిక్, ఎన్టీఆర్

గోవాకు నాని ,ఎన్టీఆర్

ఎన్టీఆర్ 30- సెట్ లోకి అడుగుపెట్టిన యంగ్ టైగర్

#NTR 30 మూవీ అప్ డేట్

లవ్లీ బ్యూటీ ప్రీతి జింతాతో ఎన్టీఆర్ క్లిక్

ఎన్టీఆర్ తో పౌరాణిక్ జోనర్ ట్రై చేస్తున్నాం

1 బిలియన్ కు చేరువలో ఆర్ఆర్ఆర్

దేవర సెకండ్ సింగిల్.. యూట్యూబ్‌లో సెన్సేషన్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా మేకర్స్ ‘దేవర’ నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన ‘ఫియర్ సాంగ్’ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

దేవర అలా ఉంటుంది
ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.

వార్ 2 -నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేసుకుంది ఈసినిమా. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా మేకర్స్. కాగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ సింహాద్రి కోసం మాస్ కా దాస్
స్టార్ హీరోల సినిమాలకు వారి పుట్టినరోజులకు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎంతో మంది హీరోల సినిమాలను రీరిలీజ్ చేశారు. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాతో పాటు పలువురు హీరోల సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయగా అది ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకు సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్డేట్
ఎన్టీఆర్ 30 షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో వున్నారు సినిమా యూనిట్. అందులో భాగంగా ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈసినిమా వచ్చే వారం నుండి మూడో షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకోనుంది.మొదటి రెండు షెడ్యూల్స్ లో యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయగా మూడో షెడ్యూల్ కూడా ఫైట్ సీన్స్ ను చిత్రీకరించనున్నారట. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ జరుగనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆల్రెడీ వీరిద్దరూ ఈసినిమా షూటింగ్ లోకూడా పాల్గొన్నారు.

ఎన్టీఆర్30 సెకండ్ షడ్యూల్ పూర్తి
ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికితోడు ఈసినిమా కథపై రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని.. కొరటాల శివ, ఎన్టీఆర్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ను ఇవ్వనున్నారని.. ఇంకా ఎన్టీఆర్ రెజ్లర్ గా కనిపించనున్నాడని ఆ ఎపిసోడ్ సినిమాకై హైలెట్ గా నిలవనుందని అంటున్నారు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

NTR 30-హైలెట్ గా ఎన్టీఆర్ రెజ్లర్ రోల్
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా ఎన్టీ30. ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 అనే టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను చేస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అందరూ. ఇక కొరటాల శివ కూడా ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొనే సాలిడ్ కథను సిద్దం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఎన్టీఆర్ 30షూటింగ్ అప్డేట్
ఎన్టీఆర్ 30 ప్రారంభం ఆలస్యం అయ్యింది కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది.గత నెలలో షూటింగ్ మొదలుకాగా తాజాగా రెండో షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు.ఈషెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.రామోజీఫిల్మ్ సిటీ లో స్పెషల్ గా వేసిన సెట్ లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు.ఈషెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నాడు.ఇందులో సైఫ్ విలన్ గా నటిస్తన్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ తో వర్క్ చేస్తా అంటున్న హాలీవుడ్ మేకర్
ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళితో పాటు ఆ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు కూడా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఎంతో మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సినిమాను చూడటమే కాకుండా వారి నటనపై ప్రశంసలు సైతం కుమ్మరించారు. అంతేకాదు కొంతమంది వారితో వర్క్ చేయాలన్న కోరికను కూడా బయటపెడుతున్నారు. తాజాగా ఈసినిమా చూసిన ఓ సెలబ్రిటీ కూడా ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయి తనతో వర్క్ చేయాలన్న ఆకాంక్షను బయటపెట్టారు. ఆయన ఎవరో కాదు 'గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ' చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్.

ప్రముఖులకు ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో తన 30 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళదామనుకున్నారు కానీ అనుకొని కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ కూడా రీసెంట్ గానే షూటింగ్ లో పాల్గొన్నాడు. వచ్చిన కథనాల ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు కూడా తెలుస్తుంది.

వార్ 2కి హృతిక్ తోపాటు అతన్నే అనుకున్నాం
వార్ 2తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి వెళ్లనున్నాడని తెలిసిందే.అఫీషియల్ గా ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది.హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కలిసి వార్ 2 లో నటించనున్నారు. బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా ఈఏడాది నవంబర్ లో ప్రారంభంకానుంది.బ్లాక్ బాస్టర్ మూవీ వార్ కి సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కనుంది.వార్ లో హృతిక్ తోపాటు టైగర్ ష్రాఫ్ నటించగా 2019లో విడుదలైన ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.

వార్ 2 కి సిద్దమైన హృతిక్, ఎన్టీఆర్
సినీ ఇండస్ట్రీల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. టాలెంట్ ఎక్కడ ఉంటే మేకర్స్ అక్కడికి వెళ్లిపోతున్నారు. అందుకే పయోగాత్మక సినిమాలు ఎన్నో చూస్తున్నాం. అంతేకాదు నటీనటులు కూడా ఒకే భాషకు పరిమితం కాకుండా వేరే భాషల్లో తమ ప్రతిభను చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మనవాళ్లు హిందీలో అలానే హిందీ నటీ నటులు తెలుగులో నటించడానికి ఏమాత్రం సందేహించడంలేదు. ఇప్పటికే మనవాళ్లు చాలామంది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఓ పవర్ పుల్ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ఈ అప్ డేట్ తో…

గోవాకు నాని ,ఎన్టీఆర్
దసరాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు నాని. ఈసినిమా రేపటితో 100కోట్ల క్లబ్ లోకి చేరనుంది. ఇక నాని తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయనున్నాడు.ఇటీవలే లాంచ్ అయిన ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షెడ్యూల్ గోవాలో జరుగనుంది.ఈలాంగ్ షెడ్యూల్ ఈరోజే ప్రారంభంకానుంది. ఇందుకోసం నాని,గోవా వెళ్లనున్నాడు.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్నఈ సినిమాకి శౌర్యువ్ డైరెక్టర్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్.వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.

ఎన్టీఆర్ 30- సెట్ లోకి అడుగుపెట్టిన యంగ్ టైగర్
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమాన తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో ఎదురుచూస్తుండగా.. రీసెంట్ గానే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఇన్ని రోజులు కొరటాల శివ షూటింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. ఈనేపథ్యంలోనే ఈసినిమాకు పనిచేస్తున్న హాలీవుడ్ టెక్నీషియన్స్ ను సైతం పరిచయం చేశాడు. ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. ఇక ఇప్పుడు విఎఫ్ఎక్స్ కోసం మరో హాలీవుడ్ టెక్నీషియన్ బ్రాడ్ మిన్నిచ్ తీసుకున్నారు.

ఆస్కార్ వేడుకలో నెంబర్ వన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్
అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లో మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ 95 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకను 16. 6 మిలియన్ మంది లైవ్ లో వీక్షించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకొంది. 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా తెలుగు దర్శకుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.

#NTR 30 మూవీ అప్ డేట్
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న #NTR30 మూవీ ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. #NTR30 మూవీ తెలుగు తో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 2024 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ కానుంది.

లవ్లీ బ్యూటీ ప్రీతి జింతాతో ఎన్టీఆర్ క్లిక్
ఆర్ఆర్ఆర్ సినిమాతో భారత సినీ ఘనత మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగుతుంది. ఇప్పటికే ఈసినిమా పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసినిమా లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుల బరిలో ఉంది. 12వ తేదీన లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే హీరోలు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇంకా పలువురు యూఎస్ కి వచ్చి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

ఆస్కార్ అవార్డ్స్ వేదిక పై రామ్ చరణ్ , ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ డ్యాన్స్ లైవ్ పెర్ఫార్మెన్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ తో పౌరాణిక్ జోనర్ ట్రై చేస్తున్నాం
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ ఆర్సీ 15ను పూర్తిచేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఇంకా తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. దీంతో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చూస్తున్నారు. వచ్చే నెలలో ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించనున్నారు. ఇక ఈసినిమా తో పాటు ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

1 బిలియన్ కు చేరువలో ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. అయితే ఆర్ఆర్ఆర్ తో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా ఖాతాలో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం చేరాయి.