కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ ఆర్సీ 15ను పూర్తిచేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఇంకా తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. దీంతో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చూస్తున్నారు. వచ్చే నెలలో ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించనున్నారు. ఇక ఈసినిమా తో పాటు ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా నిర్మాత నాగవంశీ ఎన్టీఆర్ తో సినిమాను ట్రై చేస్తున్నట్టు తెలిపారు. అది కూడా పౌరాణిక బ్యాక్ డ్రాప్ లో ట్రై చేస్తున్నట్టు తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ ఎన్టీఆర్ తో సినిమా గురించి మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్ కుపెద్ద ఫ్యాన్ అన్న సంగతి అందరికీ తెలుసు.. అయితే ఇటీవల కొన్ని కారణాల వలన మా బ్యానర్ లోని ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబో మూవీ ఆగిపోయిందని అయితే త్వరలో తమ బ్యానర్ లోనే ఎన్టీఆర్ తో భారీ పౌరాణిక సినిమా చేయాలనే ఆలోచన తమకు ఉందని అన్నారు. త్రివిక్రమ్ గారికి అటువంటి జానర్ కొత్త కాబట్టి దానిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఈసినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని చెప్పారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీలో ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: