స్టార్ హీరోల సినిమాలకు వారి పుట్టినరోజులకు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎంతో మంది హీరోల సినిమాలను రీరిలీజ్ చేశారు. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాతో పాటు పలువురు హీరోల సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయగా అది ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకు సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. రాజమౌళి కథ, ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ , యాక్షన్ సీన్స్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమాను ఎన్టీఆర్ బర్త్ డే కి రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ ఆడియోతో 4కెలో సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. మే17వ తేదీన జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా రానున్నాడు. మరి ఎన్టీఆర్ కు విశ్వక్ సేన్ అభిమాని అన్న సంగతి తెలిసిందే కదా.
కాగా ఈసినిమాలో భూమిక , అంకిత హీరోయిన్లుగా నటించారు. విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ 2003 జులై 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కీరవాణి సంగీతం అందించారు. ఈసినిమా 52 సెంటర్స్ లో 175 రోజులు థియేటర్లలో రన్ అయి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: