వార్ 2తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి వెళ్లనున్నాడని తెలిసిందే.అఫీషియల్ గా ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది.హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కలిసి వార్ 2 లో నటించనున్నారు. బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా ఈఏడాది నవంబర్ లో ప్రారంభంకానుంది.బ్లాక్ బాస్టర్ మూవీ వార్ కి సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కనుంది.వార్ లో హృతిక్ తోపాటు టైగర్ ష్రాఫ్ నటించగా 2019లో విడుదలైన ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు వార్ 2 ప్రారంభంకానుంది. ఈసీక్వెల్ కు మొదటినుండి హృతిక్ నే అనుకున్నారు కానీ ఎన్టీఆర్ స్థానంలో వేరే హీరోలను తీసుకోవాలని చూసారని రకరకాల వార్తలు వచ్చాయి.అందులో భాగంగా ప్రభాస్,విజయ్ దేవరకొండ ఇలా మరి కొందరిపేర్లు బయటికి వచ్చాయి.కానీ అవేవీ నిజం కాదని యాష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా అన్నారు.వార్ 2 స్క్రిప్ట్ ఎన్టీఆర్ ను మైండ్ లో పెట్టుకొని రాసిందే అతను తప్ప మరే హీరోను అనుకోలేదు.హృతిక్,ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్ ఓ సెలబ్రేషన్ లా వుంటుంది.గత 5నెలల నుండి ఎన్టీఆర్ ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకుందామని ప్రయత్నాలు చేశాం.చివరికి మార్చి లో ఎన్టీఆర్ ఓకే చెప్పారని ఆదిత్య చోప్రా తెలిపారు.ఒకవేళ ఎన్టీఆర్ కాదంటే మరో హిందీ హీరో ను తీసుకునేవాళ్లమని ఆయన అన్నారు.దాంతో హృతిక్ రోషన్,ఎన్టీఆర్ లతో వార్ 2 కన్ఫార్మ్ అయ్యినట్లే. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇదిలావుంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30 లో నటిస్తున్నాడు. రీసెంట్ గా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఈషెడ్యూల్ లో ఒక భారీ ఫైట్ ను షూట్ చేసారు.ఈనెల చివర్లో రెండవ షెడ్యూల్ ప్రారంభంకానుంది.ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. నిజానికి ఈసినిమా తరువాత ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాల్సివుంది.అయితే అంతకుముందు ఎన్టీఆర్,వార్ 2 పూర్తి చేయనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: