యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో తన 30 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళదామనుకున్నారు కానీ అనుకొని కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ కూడా రీసెంట్ గానే షూటింగ్ లో పాల్గొన్నాడు. వచ్చిన కథనాల ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు కూడా తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ పలువురు సినీ ప్రముఖులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. తనకు ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, నిర్మాత శిరీష్, మైత్రి సంస్థ నిర్మాతలు, శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు కార్తికేయ, మరికొంతమంది ప్రముఖులు విచ్చేశారు. ఇక ఇదే పార్టీకి అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ కూడా రావడం విశేషం. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq
— Jr NTR (@tarak9999) April 12, 2023
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్, విఎఫ్ఎక్స్ కోసం మరో హాలీవుడ్ టెక్నీషియన్ బ్రాడ్ మిన్నిచ్ తీసుకున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: