యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేసుకుంది ఈసినిమా. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా మేకర్స్. కాగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఎన్టీఆర్ తన మార్కెట్ ను పెంచుకునే పనిలో పడ్డాడు. దీనిలో భాగంగానే బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వార్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దాని సీక్వెల్ గా వార్ 2 సినిమా రానుంది. సీక్వెల్‌లో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా టైమ్ పడుతుంది. అయితే ఈగ్యాప్ లో ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో ఎన్టీఆర్ రోల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. అంతేకాదు ఎన్టీఆర్ కు హృతిక్ రోషన్ కు మధ్య భయంకరమైన యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయని.. ఇవే సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.
కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు భారీ స్థాయిలో ఈసినిమాను నిర్మించనున్నారు. వార్ మొదటి భాగానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వహించగా..వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: