ఎన్టీఆర్30 సెకండ్ షడ్యూల్ పూర్తి

ntr 30 movie second schedule completed

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికితోడు ఈసినిమా కథపై రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని.. కొరటాల శివ, ఎన్టీఆర్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ను ఇవ్వనున్నారని.. ఇంకా ఎన్టీఆర్ రెజ్లర్ గా కనిపించనున్నాడని ఆ ఎపిసోడ్ సినిమాకై హైలెట్ గా నిలవనుందని అంటున్నారు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా లేట్ గా సెట్స్ పైకి వెళ్లినా షూటింగ్ మాత్రం గ్యాప్ లేకుండా చేస్తున్నారు. ఆమధ్యనే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేయగా ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా సెకండ్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈసినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తయిందని సినిమాటోగ్రాఫర్ రత్న వేల్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఎన్టీఆర్ స్టైల్ ఇంకా యాక్షన్ అద్భుతం అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.