రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. అయితే ఆర్ఆర్ఆర్ తో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా ఖాతాలో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం చేరాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ కూడా పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. అక్కడ కొన్ని థియేటర్లలో 100 రోజులు సైతం పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా కలెక్షన్ల పరంగా కూడా ఈసినిమా పలు రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా అక్కడ 950 మిలియన్ జపాన్ యిన్స్ మార్క్ కి చేరుకున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో 1 బిలియన్ కు చేరువవుతుందని అంటున్నారు. అది జరిగితే అందుకుంటే ఇండియన్ సినిమా నుంచి మొట్టమొదటి 1 బిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా ఆర్ఆర్ఆర్ మరో రికార్డును క్రియేట్ చేస్తుంది.
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: