ఎన్టీఆర్ 30 ప్రారంభం ఆలస్యం అయ్యింది కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది.గత నెలలో షూటింగ్ మొదలుకాగా తాజాగా రెండో షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు.ఈషెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.రామోజీఫిల్మ్ సిటీ లో స్పెషల్ గా వేసిన సెట్ లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు.ఈషెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నాడు.ఇందులో సైఫ్ విలన్ గా నటిస్తన్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నెక్స్ట్ షెడ్యూల్ మే సెకండ్ వీక్ లో జరుగనుంది.వీలైనంత తొందరగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలనే యోచనలో వున్నారు టీం.ఎందుకంటే తరువాత వీఎఫ్ఎక్స్ కు టైం కేటాయించనున్నారు.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది జాన్వీ.యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ 5న తెలుగుతోపాటు హిందీ,కన్నడ, మలయాళ,తమిళ భాషల్లో విడుదలకానుంది.
ఇక ఈసినిమా తరువాత ఎన్టీఆర్,వార్ 2లో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రానున్న ఈసినిమాలో హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కలిసి నటించనున్నారు.బ్లాక్ బాస్టర్ మూవీ వార్ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాను యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. త్వరలోనే ఈసినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: