స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా ఎన్టీ30. ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 అనే టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను చేస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అందరూ. ఇక కొరటాల శివ కూడా ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొనే సాలిడ్ కథను సిద్దం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభియనం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో ఎన్టీఆర్ రెజ్లర్ గా కనిపించనున్నాడట. ఈసినిమాకు ఇదే హైలెట్ గా ఉండబోతుందట. ఎన్టీఆర్ రోల్ లో క్రేజీ ట్విస్ట్ ఉంటుందని.. ఇంటర్వెల్ తరువాత వచ్చే ఎన్టీఆర్ పాత్ర.. ఎన్టీఆర్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, లుక్ ఇంకా ఎక్స్ ప్రెషన్స్ అన్నీ సర్ ప్రైజింగ్ ఉంటాయని అంటున్నారు.
కాగా ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ ను హాలీవుడ్ సినిమాలకి వర్క్ చేసిన బ్రాడ్ మిన్నిచ్ అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: